»   » అది శ్రీవిష్ణుకు బ్రేక్ ఇచ్చినట్లే: కొత్త కాన్సెప్ట్‌తో సినిమా, స్టార్ హీరోతో కలిసి మల్టీస్టారర్

అది శ్రీవిష్ణుకు బ్రేక్ ఇచ్చినట్లే: కొత్త కాన్సెప్ట్‌తో సినిమా, స్టార్ హీరోతో కలిసి మల్టీస్టారర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అప్పట్లో ఒక్కడుండేవాడు సినిమా శ్రీవిష్ణుకు బ్రేక్ ఇచ్చినట్లే ఉంది. ఆయన హీరోగా మరో చిత్రం ప్రారంభం కాబోతున్నది. 2016 చివ‌రిలో మంచి క‌మ‌ర్షియ‌ల్ చిత్రంగా కొత్త కాన్సెప్ట్ తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంసలు, ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ అందుకున్న విషయం తెలిసిందే.

New film to begin with Sree Vishnu as hero

"అప్ప‌ట్లో ఓక‌డుండేవాడు" లాంటి న్యూవేవ్ మూవీతో గ‌త సంవ‌త్స‌రానికి ఘ‌నంగా వీడ్కోలు పలికిన యంగ్ హీరో శ్రీవిష్ణు, ఓ స్టార్ హీరో, ఇంకో ఇద్ద‌రు పాపుల‌ర్ హీరో, హీరోయిన్స్ కాంబినేష‌న్ లో కాన్సెప్టెడ్ మ‌ల్టిస్టార‌ర్ చిత్రం తీస్తున్నారు. ఈ చిత్రం ద్వారా ఇంద్ర‌సేన ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కానున్నారు. బాబా క్రియోష‌న్స్‌ బ్యాన‌ర్ పై డా. ఎం.వి.కె రెడ్డిగారు స‌మ‌ర్ప‌ణ‌లో అప్పారావు బెల్లాన‌ నిర్మాత‌గా తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి లో సెట్స్ మీది‌కి వెళ్లనుంది.

New film to begin with Sree Vishnu as hero

ద‌ర్శ‌కుడు ఇంద్ర‌సేన మాట్లాడుతూ.." ఈ చిత్రం రెగ్యుల‌ర్ క‌మ‌ర్ష‌య‌ల్ చిత్రాల కంటే భిన్నంగా వుంటుంది. కొత్త క‌థ‌, క‌థ‌నాల‌తో కంప్లీట్ వెస్ట్ర‌న్ మూవీస్ బాట‌లో సాగుతుంది. ఈ చిత్రం లో స‌మాంత‌రంగా సాగే మూడు క‌థ‌లుంటాయి. అందులో వుండే మూడు మిస్ట‌రీస్ ని చేధించ‌డం మీద ఈ క‌థ ఆధార‌ప‌డి వుంటుంది. ఇది రొల‌ర్ కాస్ట‌ర్ థ్రిల్ల‌ర్ గా ప్రేక్షకుల్ని ఆక‌ట్టుకుంటుంది. మిగతా వివ‌రాలు అతి త్వ‌ర‌లో మీకు తెలియ‌జేస్తాం.." అని అన్నారు

New film to begin with Sree Vishnu as hero

డాక్ట‌ర్‌. ఎం.వి.కె రెడ్డి స‌మ‌ర్ఫ‌ణ‌..
ప్రోడ‌క్ష‌న్ డిజైన‌ర్- రాజీవ్ నాయిర్‌,
సంగీతం- స‌తీష్ ర‌ఘునాధ‌న్‌,
నిర్మాత‌- అప్పారావు బెల్లాన‌
క‌థ‌,క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వం- ఇంద్ర‌సేన ఆర్

English summary
Appatlo Okkadundevadu fame Sree Vishnu is acting in a multi starrer film, dirceted by Indrasena.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu