»   » సెట్లో పవన్ కళ్యాణ్ సరదా సరదాగా (సర్దార్ న్యూ మేకింగ్ వీడియో)

సెట్లో పవన్ కళ్యాణ్ సరదా సరదాగా (సర్దార్ న్యూ మేకింగ్ వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్స్ మోత పుట్టిస్తున్నారు. తెలుగు ఎంటర్టెన్మెంట్, న్యూస్ ఛానల్స్‌లో రోజంతా సర్దార్ గబ్బర్ సింగ్ ట్రైలర్స్ ప్రసారం అవుతున్నారు. మరో వైపు ఇంటర్నెట్, సోషల్ మీడియా సైడ్ నుండి కూడా ప్రచార పర్వం జోరుగా సాగుతోంది.

సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్స్, కొత్త ప్రోమోలు ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రానికి సంబంధించిన న్యూ మేకింగ్ వీడియో రిలీజ్ చేసారు. పవన్ కళ్యాణ్ సెట్స్ లో ఎంత సరదాగా ఉంటారో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.

సినిమా కోసం వాడిన గన్స్, గుర్రాలు.... సెట్టింగ్స్ ఇలా చాలా చూపెట్టారు ఈ వీడియోలో. ఏప్రిల్ 8న ఉగాది సందర్భంగా 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం రిలీజవుతోంది. వరల్డ్ వైడ్ 42 దేశాల్లో ఈ సినిమా రిలీజవుతోంది. భారీ ఎత్తున సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఓపెనింగ్స్ పరంగా, టోటల్ వసూళ్ల పరంగా ఈ సినిమా సారికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి 'U' ' సర్టిఫికేట్ లభించింది. కాజల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించగా దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. ఇప్పటికే ఈపాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

English summary
Powerstar Pawan Kalyan's Sardaar Gabbar Singh is just a couple of days away from the release and the already charged Powerstar fans are currently rejoicing every minute by experiencing the pre-release hype of their matinée idol's film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu