»   »  'అత్తారింటికి దారేది' వ్యూహమే మంచు విష్ణు కూడా...

'అత్తారింటికి దారేది' వ్యూహమే మంచు విష్ణు కూడా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటించిన చిత్రం 'అత్తారింటికి దారేది'. ఓ ప్రక్క సమ్మెలు,మరో ప్రక్క పైరసీ దెబ్బకట్టినా వాటిని ఇసుమంతైనా లెక్క చేయకుండా విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకొంది. వంద కోట్ల వైపు పరుగులు తీస్తోంది. ఈ దశలో చిత్ర యూనిట్ 'అత్తారింటికి దారేది'లో ఆరు నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాన్ని జోడించింది. బుధవారం నుంచి జోడించిన సన్నివేశాన్ని థియేటర్లలో చూడొచ్చు. ఈ కొత్త సన్నివేశం ఇంకెన్ని కోట్లను తెచ్చిపెడుతుందో? అని ఇండస్ట్రీ అంచనాలు వేస్తోంది. ఇక మరోవైపు మంచు విష్ణు కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.

మంచు విష్ణు హీరోగా నటించిన చిత్రం 'దూసుకెళ్తా'. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీపావళి నుంచి ఓ కొత్త పాట ఈ సినిమాలో జోడిస్తున్నారు. అంతేకాదు సెకండాఫ్ లో వెన్నెల కిషోర్‌ - విష్ణులపై కొన్ని వినోదాత్మక సన్నివేశాలు కలిపినట్టు సమాచారం. దాంతో ఈ చిత్రం మరింత కలెక్షన్స్ పుంజుకునే అవకాసమున్నట్లు చెప్తున్నారు.

అయితే ఈ వ్యూహం కొత్తది కాదు. ఇది వరకటి నుంచీ ఉన్నదే. 'చూడాలని ఉంది' సినిమా కోసం చిరంజీవి, వూర్మిళలపై ఓ గీతాన్ని జోడించారు. మొన్నామధ్య 'మగధీర' సినిమాలో ఇలాగే కొన్ని దృశ్యాలను కలిపారు. తర్వాత 'మిర్చి' సినిమాకి ఇదే చేశారు. ఆ సినిమా యాభై రోజులు ఆడిన తరవాత ఓ పోరాట దృశ్యాన్ని జోడించారు. 'ప్రభాస్‌ కొత్త ఫైట్‌..' అంటూ ప్రచారం చేశారు. దాంతో ఇంకొన్ని వసూళ్లు దక్కాయి. ఇప్పుడు 'అత్తారింటికి దారేది', 'దూసుకెళ్తా' సినిమాలు కూడా ఈ పద్ధతినే అనుసరిస్తున్నాయి.

ఇలా సీన్స్ కలపటం వల్ల పైగా పెద్ద ఖర్చేం కాదు. హీరో అభిమానులు మరోసారి ఆ సినిమా చూసే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఫైనల్ కాపీ చూసుకొంటున్నప్పుడు సినిమా నిడివిని దృష్టిలో ఉంచుకొంటుంటారు దర్శక నిర్మాతలు. రెండున్నర గంటలు దాటితే, కథాగమనానికి అడ్డుపడుతున్న సన్నివేశాలకు కత్తెర వేస్తుంటారు. సినిమా విడుదలైన తరవాత కత్తిరించిన సన్నివేశాలు మళ్లీ కలపడం ఓ అదనపు ఆకర్షణ మాత్రమే. దాని వల్ల ఫలితం పెద్దగా ఏమీ మారిపోదు. మరి ఈ వ్యూహం ఈ సారి...ఈ కొత్త సినిమాలకు ఎంత రాబడి తీసుకొస్తుందో చూడాలి.

English summary
The buzz in tinsel town is that the makers of ' Doosukeltha' have decided to add a few more scenes to the film. According to sources, the makers have decided to add a couple of more scenes and song to bring more audiences to theatre and to discourage piracy.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu