»   » వరుణ్ తేజ్ ‘కంచె’ కోసం భారీ సెట్ (ఫోటో)

వరుణ్ తేజ్ ‘కంచె’ కోసం భారీ సెట్ (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రాల ఫేం క్రిష్ దర్శకత్వంలో ‘కంచె' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాజీవ్ రెడ్డి నిర్మాత.

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఈ చిత్రం కోసం రామానాయుడు స్టూడియోలో భారీ సెట్ వేసారు. అందుకు సంబంధించిన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు. ఈ సెట్లో సినిమాకు సంబంధించిన స్పెషల్ ఎపిసోడ్ షూట్ చేస్తారట.

స్వాతంత్ర్యానికి ముందు జరిగిన కథతో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా ఎంపికయ్యింది. మిస్ ఇండియా కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన ప్రజ్ఞ జైస్వాల్, తెలుగులో అభిజిత్ సరసన ‘మిర్చి లాంటి కుర్రాడు' సినిమాలో కూడా హీరోయిన్.

New set for Varun Tej’s Kanche movie

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. రెండవ ప్రపంచ యుద్ధ నేపధ్యంలో ఈ సినిమా కథ ఉంటుందట. పీరియాడికల్ డ్రామాగా రూపొందబోయే ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఇండియన్ ఆర్మీ సోల్జర్ గా నటిస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.

తొలి సినిమా ‘ముకుంద'తో మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. దీనికి తోడు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అండ ఉండనే ఉంది. అందుకే రెండో సినిమాకే రెమ్యూనరేషన్ రూ. 3 కోట్లు తీసుకుంటున్నాడట. దీని తర్వాత మరో చిత్రం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. పూరి జగన్నాథ్ సినిమాను సి. కళ్యాణ్ నిర్మించబోతున్నారు.

English summary
Varun Tej, the latest entrant from the mega family, is currently busy shooting for his second movie Kanche. According to the latest update, a heavy duty set has been erected in Ramanaidu studios for a special episode of the film.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu