»   » ఫుల్ ఎంజాయ్ :న్యూఇయర్‌ పార్టీలో సూర్య, మాధవన్‌ ,మహేష్ ‌, రామ్ చరణ్ (ఫొటోలు)

ఫుల్ ఎంజాయ్ :న్యూఇయర్‌ పార్టీలో సూర్య, మాధవన్‌ ,మహేష్ ‌, రామ్ చరణ్ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: కొత్త సంవత్సరం వచ్చింది. సామాన్యుల నోట్ల రద్దు దెబ్బతో ఈ వేడుకలకు కాస్తంత దూరంగానే ఉన్నా, సెలబ్రెటీలు మాత్రం చాలా ఉత్సాహంగా ఈ వేడుకలను జరుపుకున్నారు. తమ ఫ్యామిలలతో ఈ వేడుకలో పాల్గొని ఎంజాయ్ చేసారు.

సూపర్‌స్టార్‌ మహేష్ బాబు కుటుంబం, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ దంపతులు నూతన సంవత్సర వేడుకలను కలిసి జరుపుకున్నారు. స్విట్జర్లాండ్‌లోని జురిచ్‌ నగరంలో వీరు న్యూఇయర్‌ వేడుకను జరుపుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా తీసిన ఫొటోలను మహేశ్‌ సతీమణి నమ్రత, చెర్రీ సతీమణి ఉపాసన సోషల్‌మీడియా ద్వారా పంచుకున్నారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. మహేశ్‌, నమ్రత, చెర్రీ, ఉపాసన బ్లాక్‌ కలర్‌ పార్టీ వేర్‌లో మెరిశారు. గల్లా జయదేవ్‌ కుటుంబ సభ్యులు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

అలాగే తమిళ హీరో సూర్య దంపతులు నటుడు మాధవన్‌ దంపతులతో కలిసి నూతన సంవత్సర వేడుకలను ఆనందంగా జరుపుకొన్నారు. తన భార్య సరిత, సూర్య, జ్యోతికలతో కలిసి దిగిన ఫొటోను మాధవన్‌ ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు.

'నా ప్రియమైన స్నేహితులు, కుటుంబ సభ్యులతో.. న్యూ ఇయర్‌ పండుగ. లవ్‌ యు బ్రో.. సూర్య' అని మాధవన్‌ ట్వీట్‌ చేశారు. దీనికి హీరో సూర్య స్పందిస్తూ.. 'ఈ బంధం చాలా ప్రత్యేకమైనది బ్రో! నువ్వు చేసిన పనికి ధన్యవాదాలు చెబితే సరిపోదు' అని సూర్య సమాధానం ఇచ్చారు.

హరి దర్శకత్వంలో సూర్య నటించిన 'ఎస్‌ 3' చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మాధవన్‌ ప్రస్తుతం పుష్కర్‌-గాయత్రి దర్శకత్వంలో 'విక్రమ్‌ వెద' అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు.

English summary
Mahesh Babu and Ram Charan brought in 2017 together along with their family and friends in Switzerland. The wives of both the stars shared pictures from their New Year party on social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu