»   » 'బిరియానీ' సిద్ధం అంటూ దర్శకుడు

'బిరియానీ' సిద్ధం అంటూ దర్శకుడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆవారా, యుగానికి ఒక్కడు, నాపేరు శివలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొన్నాడు కార్తి. ఇప్పుడు 'బిరియానీ' రుచుల్ని పంచడానికి సిద్ధమయ్యాడు. కార్తి హీరోగా నటిస్తున్న చిత్రమిది. హన్సిక, మెండి థాకర్‌ హీరోయిన్స్. వెంకట్‌ ప్రభు దర్శకుడు. కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా నిర్మాత. యువన్‌ శంకర్‌రాజా స్వరాలు అందించారు. సంగీత దర్శకుడిగా ఆయనకు ఇది వందో సినిమా. ఈనెల 6న ఈ చిత్రంలోని గీతాల్ని విడుదల చేయనున్నారు.

నిర్మాత మాట్లాడుతూ ''కార్తికి ఇది సరికొత్త పాత్ర. వినోదం, యాక్షన్‌ కలగలిపి ఉంటాయి. యువన్‌ మరోసారి చక్కటి బాణీలను అందించారు. ఆయన వందో సినిమా కచ్చితంగా గుర్తిండిపోతుంది. డిసెంబరు 20న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అన్నారు.

మొదట్లో ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేద్దామనుకున్నారు. కానీ సడెన్ గా ప్లాన్ మార్చి ముందే వచ్సేస్తోంది. సంక్రాంతి కి థియోటర్స్ ఇబ్బంది,పెద్ద సినిమాల మధ్య ఈ సినిమాకు సమస్య ఎదురుతుందనే ఆలోచనలతో ఈ సినిమాని ముందుగా తీసుకువస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో హన్సిక జర్నలిస్ట్ గా కనిపించనుంది.

హన్సిక మాట్లాడుతూ.... ''నా అదృష్టం కొద్దీ రానున్న అన్నీ సినిమాల్లోనూ మంచి పాత్రలే చేస్తున్నాను. నాకు జర్నలిస్ట్ వృత్తి అంటే చాలా గౌరవం. ఒక్క సినిమాలోనైనా జర్నలిస్ట్‌గా కనిపించాలనేది నా ఆశ. త్వరలో ఆ కోరిక కూడా తీరబోతోంది. కార్తీ 'బిర్యాని' చిత్రంలో జర్నలిస్ట్‌గా నటిస్తున్నా. నా కెరీర్‌లోనే 'ది బెస్ట్' అనదగ్గ కేరక్టర్ అది'' అంది.

ఇక ఈ చిత్రంపై తమిళనాట మంచి అంచనాలే ఉన్నాయి. తెలుగులోనూ బాగానే మార్కెట్ అవుతుందని భావిస్తున్నారు. తెలుగులో కార్తీకి ఉన్న బిజినెస్ ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ వారికి నచ్చే ఎలిమెంట్స్ కలిపి మరీ నిర్మించారని చెప్తున్నారు. శకుని,బ్యాడ్ బోయ్ చిత్రాలు నిరాశ పరిచిన నేపధ్యంలో ఈ చిత్రం కార్తీకి ఊపునిస్తుందని భావిస్తున్నారు. ఛాయాగ్రహణం: శక్తిశరవణన్‌, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, సహ నిర్మాతలు: ఎన్‌.ఆర్‌. ప్రకాష్‌బాబు, ప్రభు.

English summary
Karthi starrer Biryani is a bilingual and has Hansika Motwani as its leading lady. Sources inform us that both the Telugu and Tamil version of this film will be released on the 20th December.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu