»   » ఆస్కార్ బరిలో న్యూట‌న్: 91 సినిమాల‌తో పోటీ ప‌డుతున్న భార‌తీయ సినిమా

ఆస్కార్ బరిలో న్యూట‌న్: 91 సినిమాల‌తో పోటీ ప‌డుతున్న భార‌తీయ సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ న‌టుడు రాజ్ కుమార్ రావు న‌టించిన న్యూట‌న్ మూవీ ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల కోసం ఎంపికైంది.. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం స‌మాచార శాఖ మంత్రిత్వ శాఖ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఆస్కార్ అవార్డుల కోసం మనదేశం తరుపున న్యూట‌న్ మూవీని అధికారికంగా నామినేట్ చేస్తున్న‌ట్లు పేర్కొంది. ఈ ఏడాది బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వర్షం కురిపించిన బాహుబ‌లి2 , దంగ‌ల్, గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాలు న్యూటన్ ముందు తేలిపోయాయి. అమిత్‌ వి.మసుర్‌కర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన న్యూటన్ చిత్రం ఈ రోజే విడుదల అయింది. ఈ మూవీకి పలువురు ప్ర‌ముఖుల ప్ర‌శంస‌లు ల‌భించాయి.

 అమిత్ మసూర్కర్

అమిత్ మసూర్కర్

ఇంత వరకూ ఇడియాకు సంబంధించిన సినిమాలేవీ ఈ కేటగిరిలో అవార్డును సంపాదించలేకపోయాయి. ఆ లోటు ‘న్యూటన్' తో అయినా తీరుతుందేమో చూడాలి. ఈ సినిమాలో రాజ్ కుమార్ రావ్ ప్రధాన పాత్ర పోషించాడు. మావోయిస్ట్ ప్రభావిత అడవుల్లో ఎన్నికల డ్యూటీకి వెళ్ళిన ప్రభుత్వ క్లర్క్‌కు ఎదురరైన ఘటనల నేపథ్యంపై తెరకెక్కిన ఈ చిత్రానికి అమిత్ మసూర్కర్ ద‌ర్శ‌కుడు..

 మొత్తం 92 చిత్రాలు

మొత్తం 92 చిత్రాలు

90వ అకాడ‌మీ అవార్డుల్లో ఉత్త‌మ విదేశీ చిత్రం కేట‌గిరీకి వివిధ దేశాల నుంచి మొత్తం 92 చిత్రాలు వ‌చ్చాయి. వీటిలో భార‌త్ నుంచి ఎంపికైన `న్యూట‌న్` సినిమా కూడా ఉంది. ఈ లెక్క‌న చూస్తే ఈ ఏడాది ఆస్కార్ నామినేష‌న్ ద‌క్కించుకోవాలంటే `న్యూట‌న్‌` చిత్రం మిగ‌తా 91 చిత్రాల‌తో పోటీప‌డాల్సి ఉంది. హైతీ, హోండూర‌స్‌, లావో పీపుల్స్ డెమోక్ర‌టిక్ రిప‌బ్లిక్‌, మొజాంబిక్‌, సెన‌గ‌ల్‌, సిరియా దేశాలు మొద‌టిసారిగా ఈ కేట‌గిరీలో పోటీప‌డుతున్నాయి.

రాజ్ కుమార్ రావు

రాజ్ కుమార్ రావు

ఆస్కార్ రేసులో న్యూటన్ నిలవడంతో చిత్ర టీం ఫుల్ ఆనందంలో ఉంది. చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన రాజ్ కుమార్ రావు తన ట్విట్టర్ ద్వారా టీం అందరికి శుభాకాంక్షలు తెలియజేశాడు. న్యూటన్ చిత్రం బ్లాక్ కామెడీ తరహా సినిమాగా రూపొందగా, చత్తీస్ ఘడ్‌లో జరిగిన ఎన్నికలలో పాల్గొన్న ఓ ప్రిసైడింగ్ ఆఫీస‌ర్‌ కథే ఈ సినిమా.

జ‌న‌వ‌రి 23, 2018న

జ‌న‌వ‌రి 23, 2018న

ఎన్నిక‌ల క‌థాంశం నేప‌థ్యంలో వ‌చ్చిన ఈ చిత్రాన్ని ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా నియ‌మించిన 14 మంది స‌భ్యుల ఆస్కార్ జ్యూరీ క‌మిటీ 2018 ఆస్కార్ ఎంట్రీకి ఎంపిక చేసింది. నామినేష‌న్ల‌కు ఎంపికైన చిత్రాల వివ‌రాల‌ను జ‌న‌వ‌రి 23, 2018న ఆస్కార్ వెల్ల‌డించ‌నుంది. అలాగే 2018, మార్చి 4న అవార్డుల‌ను అంద‌జేయ‌నుంది.

English summary
The organisers of the Academy Awards have confirmed that Rajkummar Rao's 'Newton' is on the list for consideration in the Foreign Language Film category for the Oscars.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu