»   » ‘బాహుబలి’ని తోసేసి ఆస్కార్ రేసులో ‘న్యూటన్’, రాజమౌళి స్పందన ఇదీ...

‘బాహుబలి’ని తోసేసి ఆస్కార్ రేసులో ‘న్యూటన్’, రాజమౌళి స్పందన ఇదీ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ మధ్య కాలంలో ఇండియాలో వచ్చిన గొప్ప సినిమా, బాగా నచ్చిన సినిమా ఏది అంటే.... భారత దేశ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్లో ఎక్కువ మంది చెప్పే ఒకే మాట 'బాహుబలి'. అత్యధిక మంది ప్రేక్షకులు మెచ్చిన సినిమా ఇది. ఈ సినిమాకు పలు జాతీయ అవార్డులు సైతం వచ్చాయి. ఈ సారి ఇండియా నుండి ఆస్కార్ రేసులో ఈ చిత్రం ఉంటుందని చాలా మంది భావించారు.

అయితే అందరి ఊహలు తారుమారయ్యాయి. బాలీవుడ్ చిత్రం 'న్యూటన్' ఇండియా నుండి బెస్ట్ ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో 90వ ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయింది. రాజ్ కుమార్ రావు నటించిన ఈచిత్రానికి అమిత్ వి మసూర్కర్ దర్శకత్వం వహించారు.

న్యూటన్

న్యూటన్

న్యూటర్ అనేది బ్లాక్ మనీ నేపథ్యంలో సాగే సినిమా. అమిత్ వి మసూర్కర్ దర్శకత్వం వహించిన రెండో సినిమా. ఆస్కార్ రేసుకు చాలా ఇండియన్ సినిమాలు పోటీ పడగా ఈ చిత్రం అన్నింటినీ వెనక్కి నెట్టి ముందు నిలిచింది.

రాజమౌళి స్పందన

రాజమౌళి స్పందన

తన బాహుబలి సినిమా ఆస్కార్ రేసులో నిలవక పోవడంపై రాజ‌మౌళి ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ త‌న సినిమా ఆస్కార్ రేసులో నిల‌వ‌క‌పోవ‌డంపై తాను అసంతృప్తిగా ఏమీ లేనని స్పష్టం చేశారు.

అవార్డుల కంటే అదే ముఖ్యం

అవార్డుల కంటే అదే ముఖ్యం

త‌న సినిమాలు అవార్డులు రావడం కంటే కూడా ప్రేక్షకలకు నచ్చడం, నిర్మాతలకు డబ్బులు తెచ్చిపెట్ట‌డం ముఖ్యమని తెలిపారు. తాను అవార్డుల కోసం సినిమాలు చేయనని తెలిపారు.

అవే ఆలోచిస్తాను

అవే ఆలోచిస్తాను

తాను ఏదైనా సినిమా చేయాలంటే.... ముందు ఆ సినిమా క‌థ‌తో తాను ఎంతో సంతృప్తి చెందాలని, తర్వాత అది సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రేక్ష‌కుల‌ను చేరేలా ఉండాలని, ఈ రెండు కుదిరినపుడే తాను సినిమా చేస్తానని రాజమౌళి తెలిపారు.

English summary
Newton Over Baahubali For Oscars. SS Rajamouli is not disappointed that his magnum opus ‘Baahubali 2: The Conclusion’ was not chosen as India’s official entry to the Oscars for the foreign language film category this year. The filmmaker says his aim is to take stories to a wider audience, and making money for the team, instead of winning awards.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu