twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలి, దంగల్‌కు షాక్.. ఆస్కార్ బరిలో న్యూటన్.. బిగ్ బీ షాకింగ్ కామెంట్స్

    సినిమా పరిశ్రమలో నోబెల్ బహుమతిగా భావించే ఆస్కార్ అవార్డుల రేసులో భారతీయ చిత్రం న్యూటన్ నిలిచింది. సెప్టెంబర్ 22న రిలీజైన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు హీరోగా నటించారు.

    By Rajababu
    |

    సినిమా పరిశ్రమలో నోబెల్ బహుమతిగా భావించే ఆస్కార్ అవార్డుల రేసులో భారతీయ చిత్రం న్యూటన్ నిలిచింది. సెప్టెంబర్ 22న రిలీజైన ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు హీరోగా నటించారు. ఈ చిత్రానికి అమితాబ్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకలు, సినీ విమర్శకుల నుంచి మంచి స్పందన వ్యక్తమవుతున్నది. దేశవ్యాప్తంగా అందర్ని ఆకర్షిస్తున్న ఈ చిత్ర కథ ఏంటంటే..

    ప్రిసైడింగ్ ఆఫీసర్ కథే ..

    ప్రిసైడింగ్ ఆఫీసర్ కథే ..

    చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జరిగే ఎన్నికల సందర్భంగా అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్న ప్రిసైడింగ్ ఆఫీసర్ కథే న్యూటన్. ఎన్నికల్లో గుండాలు, రౌడీలు దురాగతాలను ఎదిరించి అధికారిగా రాజ్‌కుమార్ అత్యుత్తమమైన నటనను ప్రదర్శించారు. రాజ్‌కుమార్ పాత్రను దర్శకుడు అద్భుతంగా మలిచాడనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రాజకీయాలపై వ్యంగ్యాస్త్రాలు ఉన్న ఈ చిత్రం బ్లాక్ కామెడీగా రూపొందింది.

    మావోలు దాడి చేస్తార‌ని

    మావోలు దాడి చేస్తార‌ని

    మావోయిస్టులకు బలమైన పట్టు ఉన్న రాష్ట్రం చత్తీస్‌గఢ్. ఎన్నికల సమయంలో మావోలు దాడి చేస్తార‌ు అనే విషయం తెలిసినా తన విధులను నిర్వహించడానికి అధికారి ముందుకెళ్తాడు. ఎన్నిక‌ల‌ను నిష్పాక్షికంగా నిర్వ‌హించాల‌న్న ల‌క్ష్యంతో రాజ్ కుమార్ రావు పాత్ర చేసే ప్ర‌య‌త్న‌మే న్యూట‌న్ సినిమా. ఈ సినిమాకి మ‌నీష్ ముంద్ర క‌థ‌ని అందించారు. పంక‌జ్ త్రిపాఠి, అంజ‌లి పాటిల్‌, ర‌ఘువీర్ యాద‌వ్, సంజయ్ మిశ్రా ప్రధాన పాత్ర‌లుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దృశ్యం ఫిలింస్ నిర్మించింది.

     ఆస్కార్ ఉత్తమ విదేశీ చిత్రం

    ఆస్కార్ ఉత్తమ విదేశీ చిత్రం

    అద్భుతమైన కథ, కథనంతో రూపొందించిన న్యూటన్ చిత్రాన్ని ఆస్కార్ ఉత్తమ విదేశీ చిత్రం కేట‌గిరిలో ఎంపిక చేశారు. ఈ క్యాటగిరీలో దాదాపు 26 చిత్రాలు దేశం నుంచి పోటీపడ్డాయి. చివరకి న్యూట‌న్‌ చిత్రాన్ని ఫిలిం ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసింది. ఫిలిం ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా క‌మిటికి హెడ్‌గా ఉన్న తెలుగు సినీ ప్రముఖుడు సీవీ రెడ్డి ఈ చిత్రాన్ని ఉత్త‌మ విదేశీ చిత్రంగా ఎంపిక చేయ‌డం విశేషం.

    బాహుబ‌లి2 చుక్కెదురు..

    బాహుబ‌లి2 చుక్కెదురు..

    బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వర్షం కురిపించిన భారీ బడ్జెట్ బాహుబ‌లి2 , దంగ‌ల్, గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాలు ఓ చిన్న సినిమా న్యూటన్ ముందు తేలిపోయాయి. అమిత్‌ మసుర్‌కర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన న్యూటన్ చిత్రం సెప్టెంబర్ 22న విడుదలైంది. ఈ మూవీకి పలువురు ప్ర‌ముఖుల ప్ర‌శంస‌లు ల‌భించాయి.

    అమితాబ్ ట్వీట్

    బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. నేను న్యూటన్ చిత్రం చూశాను. ప్రేక్షకులకు ఇది మంచి విందు భోజనం లాంటి చిత్రం. అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకొంటే సినీ ప్రముఖులకు, ప్రజలందరికీ కనువిప్పు కలిగించే చిత్రం అని బిగ్‌ బీ ట్వీట్ చేశారు.

    English summary
    Newton is a movie about Government officer story. Newton is a young, idealistic government officer who is determined to conduct his very first election duty with honesty and integrity. Never mind that the booth he is in charge of has a total of 76 eligible voters and is in the middle of a jungle infested with Maoist rebels. This movie is getting good response from all corners. Bollywood superstar Amitabh Bachchan tweeted that 'Saw the film 'NEWTON' .. its stark reality was a treat to watch ! An eye opener .. on many aspects ..'
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X