»   » లారెన్స్, వెంకటేష్ ..బండ్ల గణేష్ నయా స్ట్రాటజీ

లారెన్స్, వెంకటేష్ ..బండ్ల గణేష్ నయా స్ట్రాటజీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నిర్మాత బండ్ల గణేష్ మళ్లీ ఫామ్ లోకి వచ్చారు. రీసెంట్ గా...మళయాళ చిత్రం టు కంట్రీస్ రైట్స్ కొన్న ఆయన ఇప్పుడు మరో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టు కంట్రీస్ చిత్రానికి వెంకటేష్ ని హీరోగా అనకుంటున్నట్లే...మరో ప్రాజెక్టు కోసం లారెన్స్ ని సీన్ లోకి తీసుకు వస్తున్నట్లు సమచారం.

ఇన్నాళ్లు ఏమయ్యాడో?...మళ్లీ తెరపైకి నిర్మాత బండ్ల గణేష్!

ముని, కాంచన, గంగా వంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన డైరక్టర్ కమ్ యాక్టర్ అండ్ డాన్సర్ రాఘవ లారెన్స్. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం లారెన్స్ తన తదుపరి సినిమాను బండ్ల గణేష్ నిర్మణంలో తీయనున్నారు. బహుశ ఈ సినిమా కూడా హరర్ కామెడీ అయ్యే అవకాసం ఉంది. ఈ విషయాన్ని అఫిషియల్ గా తన ట్విట్టర్ ఖాతా ద్వారా బండ్ల గణేష్ తెలిపారు. తనతో పాటు లారెన్స్ వున్న పోటోను కూడా పోస్ట్ ఇక్కడ మీరు చూడండి.

ఫ్రాడ్ చేసావంటూ... బండ్ల గణేష్ మీద ఫైర్ అయిన హీరో!

ఈ సినిమా కూడా పెద్ద ప్రోజెక్ట్ గానే కనిపిస్తోంది. మంచి హిట్స్ మీదన్న లారెన్స్ ఈ సినిమాను ఎలాంటి కాన్సేప్ట్ తో ముందుకు వస్తారో వేచి చూడాలి. సినిమా సినిమాకీ ఖచ్చితంగా వైవిధ్యం కొరుకునే గణేష్ కూడా తన టెస్ట్ కు తగ్గట్టే ఈ చిత్రాన్ని ప్లాన్ చేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాతారం. ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే విడుదల అఫీషియల్ గా మీడియాకు విడుదల చేస్తాం అంటున్నారు.

బండ్ల గణేష్‌పై చీటింగ్ కేసు పెట్టిన హీరో

దిలీప్ , మమతా మోహన్ దాస్ లు జంటగా నటించిన టూ కంట్రీస్ చిత్రం మలయాళంలో సూపర్‌ హిట్ కాగా , ఈచిత్రం దాదాపు 50 కోట్లకు పైగా వసూళ్ళను సాధించింది. ఈ సినిమాను చూసిన వెంకటేష్ ఇందులో హీరోగా నటించేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది.

"బాహుబలి" ని దాటే సినిమా తీయటమే నా జీవిత ధ్యేయం

గణేష్ ఈ చిత్ర రైట్స్‌ దక్కించుకోగా ఈ రీమేక్‌ చిత్రాన్ని భారీ కమర్షియల్‌ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కించాలని భావిస్తున్నాడట. దీనికి సంబంధించి సన్నాహలు జరుగుతున్నాయని, సినిమాలో నటించబోయే నటీనటులు, టెక్నికల్‌ టీం కు సంబంధించిన అన్ని విషయాలు త్వరలోనే వెల్లడిస్తానని గణేష్‌ తెలిపాడు.

English summary
Producer Bandla Ganesh is all set to produce Raghava Lawerence's next project.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu