Just In
- 6 min ago
Box office: మొత్తానికి హాఫ్ సెంచరీ కొట్టేసిన మాస్ రాజా.. క్రాక్ తెచ్చిన లాభాలు ఎంతంటే?
- 12 min ago
పడిలేచిన వాడితో పందెం చాలా ప్రమాదకరం: ఆకట్టుకుంటోన్న ‘లక్ష్య’ టీజర్
- 50 min ago
లేడి బాస్ కు స్పెషల్ బర్త్ డే విషెస్ చెప్పిన మహేష్.. అలా మొదలైన ప్రేమ..
- 1 hr ago
స్టైలిష్ లుక్‌లో దర్శనమిచ్చిన నాగశౌర్య: ‘వరుడు కావలెను’ నుంచి సర్ప్రైజింగ్ వీడియో
Don't Miss!
- News
టీడీపీలో దేవినేని ఒంటరయ్యారా ? కొడాలితో పోరులో కలిసిరాని నేతలు- మద్దతు కోసం యత్నాలు
- Automobiles
కస్టమర్లకు మరింత చేరువయ్యేందుకు రెనో ఇండియా 'మాస్టర్' ప్లాన్స్..
- Sports
ISL 2020 21: చివరలో విలియమ్స్ గోల్.. మోహన్ బగాన్‌కు మరో విజయం!!
- Finance
PNB కస్టమర్లకు అలర్ట్: ఫిబ్రవరి 1 నుండి ఈ ATM నుండి డబ్బు తీసుకోలేరు
- Lifestyle
Republic Day 2021 : రిపబ్లిక్ డే గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు మీకోసమే...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పెళ్లయ్యాక మొదటి ప్రాజెక్ట్.. వెబ్ సిరీస్‌తో నిహారిక రచ్చ.. అనసూయతో భారీ ప్లాన్
మెగా డాటర్ నిహారిక పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉంటుందనే ప్రచారం మొదటి నుంచి జరుగుతూనే ఉంది. అయితే పెళ్లి తరువాత తన మొదటి ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టేసింది. అయితే అది వెండితెరపై మాత్రం కాదు. నిహారిక వెబ్ సీరిస్‌లకు ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. తెలుగులో వెబ్ సీరిస్‌లంటే తెలియని కాలంలోనే ఓ ఊపు ఊపేసింది. తెలుగు వెబ్ సీరిస్‌లలో నిహారికది సపరేట్ ట్రెండ్. అలా మళ్లీ వెబ్ సిరీస్‌తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టేందుకు రెడీ అయింది.

వెబ్ సీరిస్‌లతో రచ్చ..
నిహారిక వెబ్ సీరిస్‌లతో ముద్దపప్పు ఆవకాయ్, నాన్నకూచి, మ్యాడ్ హౌస్ వంటి వెబ్ సీరిస్‌లతో సూపర్ హిట్లందుకుంది. బుల్లితెరపైనా నిహారిక హోస్ట్‌గా తన సత్తా చాటుకుంది. కానీ వెండితెరపైనే హీరోయిన్‌గా ఎదగలేకపోయింది. అయినా సరే నిహారిక మాత్రం తన దృష్టంతా కూడా వెబ్ సీరిస్‌ల మీదే పెట్టేసింది.

పెళ్లితో సినిమాలకు బ్రేక్..
పెళ్లి అనంతరం నిహారిక సినిమాలకు దూరంగా ఉండబోతోందన్న వార్తలు ఎప్పటి నుంచో వచ్చాయి. వాటికి తగ్గట్టే నిహారిక తాజాగా ఓ వెబ్ సీరిస్‌కు ఓకే చెప్పేసింది. వెండితెర ప్రాజెక్ట్‌లను ఆల్రెడీ పక్కన పెట్టేసిన సంగతి తెలిసింది. పెళ్లి నిశ్చయం కాక ముందు ఓ కోలీవుడ్ ప్రాజెక్ట్‌కు నిహారిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసింది.
నాగ్ హీరోయిన్ అందాల ఆరబోత.. మళ్లీ తెరపైన మెరిసిన తార

రాయుడు కథలు..
తాజాగా నిహారిక తన కొత్త ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాల గురించి అందరికీ చెప్పేసింది. భర్త చైతన్యతో కలిసి ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో పాల్గొంది. కొత్త జంట చేతుల మీదుగాజ్యోతిని వెలిగించారు. ఈ వెబ్ సీరిస్ షూటింట్ త్వరలోనే ప్రారంభం కాబోతోన్నట్టు ప్రకటించారు.

అనసూయతో భారీ ప్లాన్..
ఇక ఈ రాయుడు చిత్రాలు ప్రాజెక్ట్‌లోకి అనసూయ రావడం హైప్ పెరిగింది. బుల్లితెరపై నిహారిక,అనసూయ కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయింది. మరి ఈ కొత్త వెబ్ సీరిస్‌లో ఇద్దరూ కలిసి ఏ మేరకు రచ్చ చేస్తారో చూడాలి. ఈ ప్రాజెక్ట్‌కు సంగీత దర్శకుడిగా కళ్యాణిమాలిక్ వ్యవహరిస్తున్నాడు.