»   » నిహారిక కి పాస్ మార్కులు పడ్డట్టే...

నిహారిక కి పాస్ మార్కులు పడ్డట్టే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

నిహారిక కథానాయికగా "ఒక మనసు" అనే సినిమా మొదలవుతుందీ అన్న దగ్గరినుంచీ. మెగా అభిమానులే కాదు సాధారణ ప్రేక్షకులు కూడా ఆసక్తిగా చూసారు కారణం ఒక వారసురాలు సినిమా హీరో గ రావటం మన టాలీవుడ్ లో అరుదు. అందులోనూ మెగాస్టార్ ఫ్యామిలీనుంచి వస్తూన్న అమ్మాయి.

అప్పటికే టీవీ షోలలో యాంకర్గా, ఒక షార్ట్ ఫిలిం లోనూ, ఆతర్వాత "ముద్ద పప్పు-ఆవకాయ్" అనే యూట్యూబ్ సిరీస్ తోనూ నటిగా తన సత్తా ఏమిటో నిరూపించుకుంది నిహారిక. ఆమెనటించిన "ఒక మనసు" సినిమా అలాంటి ఈ సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో కథానాయికగా గ్లామర్ విషయంలోను., నటన విషయంలోను నిహారిక మంచి మార్కులు కొట్టేసింది. అందం,అమాయకత్వం కలిపి నిహారిక చేసిన మ్యాజిక్ కి ప్రేక్షలు పడిపోయారు.


niharika

మనం రోజూ చూసే గర్ల్ నెక్స్ట్ డోర్ లా కనిపించి అందరినీ ఆకట్టుకోవటమే కాదు. పాత్రకి ఎంత కావాలో అంతే నటించి ఎక్కడా ఓవర్ యాక్షన్ అనిపించకుందా చేసింది. పాటల్లోను చక్కని ఫీల్ ను ప్రదర్శించగలిగింది. నిహారిక కోసమే ఆ క్యారెక్టర్ ఉందేమో అన్నంతగా ఆ పాత్రలో ఇమిడిపోయిందని ఆమెను గురించి ఆడియన్స్ చెప్పుకుంటున్నారు.


యాంకర్ గా, షార్ట్ ఫిలింస్ లోనూ పర్లేదు కానీ ఒక ఫుల్ లెంగ్త్ సినిమాలో ఎలా చేస్తుందో అనుకున్న అందరికీ... సరిగ్గా నీహారిక మాత్రమే చేయగలదు అన్నంత గా తన నటనని చూపించింది. ఇక ముందు కూడా నిహారిక ఇలాగే సక్సెస్ అందుకుంటుందేమో చూడాలి.

English summary
Mega princess Niharika Konidela has made her acting debut with "Oka Manasu" and she has done justice to her role. She impresses the viewers in her first attempt.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu