»   » ఆ సినిమా ఆడదని నాకు తెలుసు: నిహారిక

ఆ సినిమా ఆడదని నాకు తెలుసు: నిహారిక

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొణిదెల నిహారిక.. మెగా ఫ్యామిలీ నుంచి మొట్టమొదటిసారిగా హీరోయిన్ గా తెరంగేట్రం చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు. అంతకుముందే 'ముద్దపప్పు ఆవకాయ' అనే వెబ్ సిరీస్ లో నటించి మెప్పించిన మెగా యాక్ట్రెస్. అదీ కాకుండా ఈ వెబ్ సిరీస్ లో నటించడంతో పాటు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే బేనర్ స్థాపించి దీన్ని స్వయంగా నిర్మించిన ఘనత కూడా నిహారిక సొంతం.

అయితే తన మొదటి సినిమానే తీవ్రంగా నిరాశ పరిచింది. ఐతే ఆ సినిమా చేసినందుకు తనకు ఎలాంటి రిగ్రెట్స్ లేవని అంటోంది నిహారిక తాను ఎంతో ఇష్టపడే ఆ సినిమా చేశానని ఆమె చెప్పింది. ఐతే 'ఒక మనసు' చేస్తున్నపుడే ఆ సినిమా ఫలితంపై కొంచెం సందేహంగా అనిపించినట్లు నిహారిక వెల్లడించడం విశేషం


Niharika Konidela About Oka Manasu Failure

తొలిసారిగా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక మంచి నటన కనబరిచింది. తన పాత్ర మేరకు చాలా చక్కగా నటించింది. లవ్, రొమాన్స్, ఎమోషన్స్ సీన్లలో బాగా చేసింది. చీరకట్టులో కనిపించి కనువిందు చేసింది. కొన్ని కొన్ని సీన్లలో చాలా మెచ్యూరిటీ నటనతో ఆకట్టుకుంది. మెగా ఫ్యాన్స్ ఏమాత్రం నిరాశ చెందకుండా నిహారిక అలరించింది. అయినా కూడా సినిమాకి గానీ, నిహారిక నటనకు గానీ యావరేజ్ కంటే ఎక్కువ మార్కులు పడలేదు


''ఒక మనసు సినిమాను నేనెంతగానో ఇష్టపడ్డాను. ఆ సినిమాను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న సందేహాలు షూటింగ్ టైంలో నాకు కలిగాయి. కానీ ఆ కథ నాకు చాలా బాగా నచ్చడంతో సినిమా చేశాను. కాబట్టి నాకు బాధేమీ లేదు. ఆ సినిమా ఆడలేదని డిప్రెషన్లోకి వెళ్లిపోవడం.. ఇంకేదో అయిపోవడం లాంటివేమీ జరగలేదు'' అని నిహారిక తెలిపింది.మనసుకు నచ్చిన సినిమాలు చేయడమే ముఖ్యమని.. మిగతా విషయాలన్నీ పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని నిహారిక అభిప్రాయపడింది.


English summary
Niharika konidela who enterd in Tollywood from Mega compound, opens up About Her first Movie Oka Manasu Failure
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu