For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాగబాబుకు ఫోన్ చేసి వెక్కి వెక్కి ఏడ్చిన నిహారిక!

  By Bojja Kumar
  |

  నిజంగానే నాగబాబుకు ఫోన్ చేసిన నిహారిక వెక్కి వెక్కి ఏడ్చింది. అంత కష్టం ఏం వచ్చింది? అలాంటి పరిస్థితులు ఏమైనా ఎదురయ్యాయా? అని మాత్రం అడగొద్దు. తండ్రికి ఫోన్ చేసి కూతురు ఏడ్చిందంటే కేవలం కష్టాలు మాత్రమే ఉంటాయనుకోవద్దు. జ్ఞాపకాలు, ఎమోషనల్ మూమెంట్స్ కూడా ఉంటాయి. ఈ విషయాన్ని నిహారిక 'హ్యాపీ వెడ్డింగ్' ప్రీ రిలీజ్ ఈవెంటులో గుర్తు చేసుకున్నారు. ఈ నెల 28న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నిహారిక ప్రసంగం ఆకట్టుకుంది. ఏ సందర్భంలో తాను ఏడ్చానో నిహారక తెలిపింది.

  Ram Charan Speech @Happy Wedding Pre Release Event
  కొన్నాళ్ల తర్వాత ఎవరైనా బోర్ కొడతారు

  కొన్నాళ్ల తర్వాత ఎవరైనా బోర్ కొడతారు

  ‘పెళ్లి కన్ఫర్మ్ అయ్యే వరకు ఒకలాగా, పెళ్లి అనుకోగానే ఒక లాగా మారిపోతావా' అంటూ.... ‘హ్యాపీ వెడ్డింగ్' మూవీలో హీరోయిన్ చెప్పే ఈ డైలాగ్ గురించి యాంకర్ ఝాన్సీ ప్రస్తావించారు. ఇలాంటివి నిజ జీవితంలో ఎప్పుడైనా చూశారా? అనే ప్రశ్నకు నిహారిక స్పందిస్తూ... అబ్బాయిలే కాదు, ప్రతి రిలేషన్ షిప్ లోనూ, ఫ్రెండ్స్ అయినపుడు ఇద్దరమ్మాయిలు లేదా ఇద్దరు అబ్బాయిలు మొదట్లో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తారు. తర్వాత బోర్ కొడతారు కదా! అంటూ సమాధానం ఇచ్చారు.

  ఒక అమ్మాయిగా నేను కనెక్ట్ అయ్యాను

  ఒక అమ్మాయిగా నేను కనెక్ట్ అయ్యాను

  హ్యాపీ వెడ్డింగ్ స్టోరీ విన్న వెంటనే సినిమా ఓకే చేయడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఒక అమ్మాయిగా నేను కథకు చాలా కనెక్ట్ అయ్యాను. ఒక అమ్మాయి వారి ఇంటిని వదిలేసి తన బ్యాగ్ అంతా సపరేట్ గా ప్యాక్ చేసుకుని ఇంకో ఇంటికి వెళ్లిపోవాలంటే... నాకు మాట్లాడుతుంటేనే చాలా దడగా ఉంది. అక్కడ నాలాగే చాలా మంది అమ్మాయిలు కనెక్ట్ అవుతారని ఈ సినిమా చేశాను అని నిహారిక తెలిపారు.

  నన్నొక గాజు బొమ్మలా చూసుకున్నారు

  నన్నొక గాజు బొమ్మలా చూసుకున్నారు

  సినిమాటోగ్రాఫర్ బాల్ రెడ్డిగారు చాలా సపోర్ట్ ఇచ్చారు. ఆయన ఫ్యామిలీలో నుండి ఒక అమ్మాయి వచ్చి సినిమాలో హీరోయిన్ గా చేస్తుందంటే ఎంత కేర్ ఉంటుందో... నన్ను కూడా అలాగే ఒక గాజు బొమ్మలా చూసుకున్నారు.

   ఈ సినిమా ఒప్పుకోవడానికి ప్రధాన కారణం

  ఈ సినిమా ఒప్పుకోవడానికి ప్రధాన కారణం

  ఈ సినిమా ఒప్పుకోవడానికి ప్రధాన కారణం డైలాగులు. భవాని ప్రసాద్ గారు అద్భుతమైన డైలాగులు రాశారు. శక్తికాంత్ ఫిదా సినిమాకు అందించిన పాటలు బాగా నచ్చాయి. ఇప్పుడు మా సినిమాకు కూడా అలాంటి మంచి పాటలు అందించారు.

  అప్పుడే ఆయనకు పెద్ద ఫ్యాన్ అయిపోయా

  అప్పుడే ఆయనకు పెద్ద ఫ్యాన్ అయిపోయా

  నాకు పర్సనల్‌గా తమన్ అందించే ఆర్ఆర్ అంటే చాలా ఇష్టం. చరణ్ అన్న చేసిన బ్రూస్ లీ సినిమాలో డాడీ చాలా సంవత్సరాల తర్వాత కనిపిస్తారు. అక్కడ డాడీ(చిరంజీవి) వెనకాల వచ్చే ఆర్ఆర్‌కు బిగ్గెస్ట్ ఫ్యాన్ అయిపోయాను. ఆయన మా సినిమాలో భాగం అయినందుకు సంతోషంగా ఉంది.

  నాన్నకు ఫోన్ చేసి వెక్కి వెక్కి ఏడ్చాను

  నాన్నకు ఫోన్ చేసి వెక్కి వెక్కి ఏడ్చాను

  ఈ సినిమాకు మురళి శర్మ, నరేష్ లాంటి బ్రిలియంట్ యాక్టర్లతో కలిసి చేశాను. మురళి శర్మగారితో ఫస్ట్ డే ఒక సీన్ ఉంది. సినిమాలో నా పాత్రకు నాన్నతో సీన్. మా నాన్న(నాగబాబు) అదే రోజు ఉదయం ఊరెళుతున్నారు. మురళీ శర్మగారితో సీన్ అయిపోయిన తర్వాత మా నాన్నకు ఫోన్ చేసి వెక్కి వెక్కి ఏడ్చాను. ఆ విషయం ఇంకా గుర్తొస్తోంది. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం.... అని నిహారిక వ్యాఖ్యానించారు.

  English summary
  Niharika Konidela Emotional Speech at Happy Wedding Pre Release Event with Ram Charan as chief guest on Telugu FilmNagar. Happy Wedding 2018 latest Telugu Movie ft. Sumanth Ashwin and Niharika Konidela. Directed by Lakshman Karya and Music by Shakthi Kanth Karthick.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X