»   » నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్‌గా మూవీ ప్రారంభం

నాగబాబు కూతురు నిహారిక హీరోయిన్‌గా మూవీ ప్రారంభం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా ఫ్యామిలీ నుంచి నాగ‌బాబు కుమార్తె నిహారిక హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. నిహారిక తొలి సినిమాకు.....మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు' వంటి ప్రేమకథా చిత్రాన్ని అందించిన రామరాజు ఈ చిత్రానికి దర్శకుడు. ‘ఒక మనసు' సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. మధుర శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగ శౌర్య హీరో.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రారంభోత్సవం బుధవారం హైదరాబాద్ లోని సాయి బాబా టెంపుల్ లో జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమానికి నిహారిక, కుటుంబు సభ్యులు, నాగ శౌర్య, దర్శక నిర్మాతలు మాత్రమే హాజరైనట్లు సమాచారం.

Niharika Konidela-Naga Shaurya film launched today

ఈ సినిమాలో నిహారిక తల్లి పాత్ర ప్రముఖ నటి రమ్య కృష్ణ చేయబోతున్నట్లు సమాచారం. సినిమాలో నిహారిక తల్లి పాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని, అందుకే రమ్య కృష్ణ లాంటి స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్టును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ విషయమై అపీషియల్ ప్రకటన రానుంది.

హెల్తీ ఎంటర్టెన్మెంట్ సబ్జెక్టుతో ఫీల్ గుడ్ గా ఈ సినిమా ఉంటుందని, మెగా ఫ్యామిలీ ఇమేజ్ ఏమాత్రం డ్యామేజ్ కాకుండా, నటిగా నిహారికకు మంచి గుర్తింపు తెచ్చే విధంగా ఉంటుందని అంటున్నారు. మధుర శ్రీధర్, టీవీ 9 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎక్కువ భాగం షూటింగ్ వైజాగ్ లో జరుగనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించనున్నారు.

English summary
Niharika Konidela-Naga Shaurya starrer film To be directed by Rama Raju of Mallela Teeram fame, the film was formally launched today in Hyderabad.
Please Wait while comments are loading...