Just In
- 49 min ago
Happy Birthday Ravi Teja: కష్టాన్ని నమ్ముకొని వేల రూపాయల నుంచి 50కోట్లకు చేరుకున్న హీరో
- 1 hr ago
ఊపిరి పీల్చుకో బాక్సాఫీస్.. మరి కొన్ని నెలల్లో కిక్కిచ్చే సినిమాలతో రాబోతున్న స్టార్ హీరోలు
- 2 hrs ago
క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి మరో షాకింగ్ లుక్.. 16ఏళ్ల కూతురు, ఎక్స్‌పోజింగ్‌తో చంపేసిందిగా..
- 3 hrs ago
RRR పోస్టర్.. ఆ సినిమా నుంచి తస్కరించారట.. రాజమౌళిపై మరోసారి ట్రోలింగ్స్
Don't Miss!
- News
జోరు పెంచిన నిమ్మగడ్డ- సచివాలయాలూ, వాలంటీర్లకూ షాక్- డీజీపీ బదిలీ ప్రచారం ?
- Sports
పుజారా.. నువ్వు ఆ షాట్ ఆడితే సగం మీసం తీసేస్తా: అశ్విన్
- Automobiles
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం 50,000 మంది క్యూలో ఉన్నారు..
- Lifestyle
మంగళవారం దినఫలాలు : వ్యాపారులకు ఈరోజు చాలా అదృష్టం కలిసి వస్తుంది...!
- Finance
రూ.50వేలకు దిగువనే బంగారం ధరలు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మెగా అనే పదం చాలా ప్రెస్టిజియస్, పెద్దనాన్న కష్టార్జితం (నిహారిక ఇంటర్వ్యూ)
హైదరాబాద్: మెగా డాటర్ నిహారిక, నాగ శౌర్య జంటగా... TV 9 సమర్పణలో, మధుర ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై రామరాజు దర్శకత్వంలో మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించిన ఒక మనసు చిత్రం జూన్ 24 న విడుదలకు సిద్ధమవుతోంది. హార్ట్ టచింగ్ లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ 'యు' సర్టిఫికేట్ పొందింది. సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో నిహారిక ప్రమోషన్లలో బిజీ అయ్యారు. తాజాగా ఆమె మీడియాతో సినిమాకు సంబంధించిన విషయాలు పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...సినిమా జూన్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. టెన్షన్‌గా అనిపించడం లేదు కానీ ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో, అవుట్‌పుట్ ఎలా ఉంటుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అన్నారు.
నేను హీరోయిన్‌గా సినీ రంగ ప్రవేశం చేయాలనుకోగానే చాలా కథలు విన్నాను. అయితే అవేవీ కనెక్ట్ కాలేదనే చెప్పాలి. అయితే 'ఒక మనసు' చిత్రంలో సంధ్య అనే క్యారెక్టర్ వినగానే మనసుకు బాగా కనెక్ట్ అయ్యింది. చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్ ఇది. నా ఫ్యామిలీ, అభిమానులు సహా అందరికీ నచ్చే పాత్రలో కనపడతాను అని నిహారిక చెప్పుకొచ్చారు.
నా కంటే ముందు వేరే ఫ్యామిలీస్ నుండి హీరోయిన్స్ వచ్చారు. అయితే వారు హీరోయిన్స్ గా కంటిన్యూ కాలేకపోయారు. ఇక నా విషయానికి వస్తే నేను చాలా రోజులుగా సినిమాల్లోకి రావాలనుకుంటున్నాను. అయితే హీరోయిన్ కావడానికి కంటే ముందు ప్రొడక్షన్ అంటే ఆసక్తి ఏర్పడింది. ప్రొడక్షన్ వ్యవహారాలను గమినిస్తూ వచ్చాను. తర్వాత నేను యాక్టింగ్ కూడా చేయవచ్చు కదా అనే ఆలోచన వచ్చింది. నాన్నగారికి ఈ విషయాన్ని చెప్పాను. ఆయన ఆలోచించుకుని సరే అన్నారు. తర్వాత పెద్దనాన్నగారు, బాబాయ్, అన్నయ్యలు ఇలా అందరితో మాట్లాడాను. అందరూ సినిమాల్లోకి వస్తే ఉండే ప్లస్ ఏంటి, మైనస్‌లేంటి అనే విషయాలపై నాతో మాట్లాడారు. అందరూ ఒప్పుకున్న తర్వాతే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను అని నిహారిక తెలిపారు.

ఒక మనసు
'ఒక మనసు' ప్యూర్ లవ్ స్టోరీ. ఇప్పటి వరకు తెలుగులో లవ్ స్టోరీస్ అంటే ‘మరోచరిత్ర', ‘గీతాంజలి' చిత్రాలు గురించి ఎక్కువగా చెబుతుంటారు. ఈ రెండు సినిమాలు తర్వాత ‘ఒకమనసు' సినిమాను గుర్తుపెట్టుకుంటారు అని నిహారిక అన్నారు.

అమ్మాయి అంటే ఇలా ఉండాలి అనేలా ఉంటుంది
ఒక మనసు' చిత్రం 80 శాతం సంధ్య, సూర్యలపై నడుస్తుంది. సంధ్య అనే పాత్ర చాలా ప్రభావం చూపుతుంది. అమ్మాయంటే ఇలా ఉండాలనేలా ఉంటుంది. ఈ సినిమా లవ్‌స్టోరీ కదా అని ఎక్కడా ఎబ్బెట్టుగా ఉండదు అని నిహారిక తెలిపారు.

అభిమానులు
నేను సినిమాల్లోకి వస్తున్నానని తెలియగానే అభిమానులు వచ్చి నాన్నను కలిసి మాట్లాడారు. నాన్న కూడా వారితో నన్ను మాట్లాడించారు. ఇంత కాలం పెద్దనాన్నను అన్నయ్యగా భావించిన అభిమానులకు ఆయన కూతురుగా నేను ఇండస్ట్రీలోకి వస్తున్నానంటే వారి సొంత అమ్మాయిలా ఫీలయ్యారు అని నిహారిక తెలిపారు.

కథ, క్యారెక్టర్ నచ్చింది కాబట్టే..
కథను నేను ఏలాంటి అంచనాలు, ఆలోచనలు లేకుండా విన్నాను. రామరాజుగారు చెప్పిన కథ, అందులో హీరోయిన్ సంధ్య క్యారెక్టరైజేషన్ బాగా నచ్చింది. దాంతో సినిమా చేయడానికి వెంటనే ఒప్పుకున్నాను. అంతే తప్ప ఆయన మొదటి సినిమా ఎంటి, ఆయన కమర్షియల్ డైరెక్టరా అని ఆలోచించలేదు అని నిహారిక తెలిపారు.

టాలెంటును నమ్ముకున్నాను
మా పెద్దనాన్నగారికి ఉన్న ఇమేజ్ వల్ల నా మొదటి సినిమా గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. నా రెండో సినిమాకు ఇంత అటెన్షన్ ఉండదు. అలాగే అభిమానులు కూడా మొదటి సినిమా ఎలా చేశానని చూస్తారు. నేను సరిగా యాక్టింగ్ చేయకపోతే నా రెండో సినిమాకు రారు. నా టాలెంట్‌తోనే నేను వారిని థియేటర్స్‌కు రప్పించాల్సి ఉంటుంది. అందుకే టాలెంటును నమ్ముకుని ఇటు వైపు వచ్చాను అన్నారు.

గ్లామర్ పాత్రలు చేయను
నేను గ్లామర్ పాత్రలు చేయడానికి ఇష్టపడటం లేదు. అలాంటి పాత్రలు చేయడానికి నేను ఆసక్తిగా కూడా లేను. నేను కథలను ఎంపిక చేసుకునేటప్పుడు నాన్నగారిని, మెగా అభిమానులను దృష్టిలో పెట్టుకునే ఎంపిక చేసుకుంటాను. కుటుంబ సభ్యులను, అభిమానులను ఇబ్బంది పెట్టే పాత్రలను మాత్రం చేయను. అన్నారు.

కష్టార్జితం
మెగా వారసురాలు అనే బాధ్యతను నేను అడగకపోయినా నాకు అభిమానులు ఇచ్చారు. అయితే మెగా అనే పదం చాలా ప్రెస్టిజియస్. పెద్దనాన్న చిరంజీవిగారి కష్టార్జితం. దాని కోసం ఆయనెంత కష్టపడ్డారో మాకు తెలుసు అన్నారు.

రోల్ మోడల్
హీరోయిన్‌గా రోల్ మోడల్ ఎవరు అనే ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. హీరో అయినా, హీరోయిన్ అంటే నటించాలి. అంటే కాబట్టి నటన పరంగా నాకు రోల్‌మోడల్ అంటే పెద్ద నాన్న చిరంజీవిగారే అని నిహారిక తెలిపారు.

దర్శకుడు రామరాజు, హీరో నాగశౌర్య గురించి
రామరాజుగారు చాలా ఇష్టంతో రాసుకున్న కథ ‘ఒక మనసు'. ఆయన డైరెక్షన్‌లో చేయడం చాలా కంఫర్ట్ బుల్‌గా అనిపించింది. అలాగే నాగశౌర్య మంచి కో స్టార్. కొన్ని సన్నివేశాల్లో నటన పరంగా బాగా సపోర్ట్ చేశాడు అని నిహారిక తెలిపారు.