»   » ఎన్టీఆర్ తో మెగాడాటర్! నిజమా రూమరా??

ఎన్టీఆర్ తో మెగాడాటర్! నిజమా రూమరా??

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఒక మనసు'తో నిహారిక కెరీర్ మలుపు తిరుగుతుందనుకుంటే.. ఆ సినిమా కాస్తా ఘోరంగా పరాజయం పాలయ్యింది. దాంతో నీహారికకి ఆఫర్లు కరువయ్యాయి అంతే కాదు నిహారిక కి ఉన్న "మెగా" మార్క్ కూడా ఆమెకి పెద్ద మైనస్ అయ్యింది. ఆ ట్యాగ్ వల్ల చిన్న హీరోలు జంకుతున్నారు..., అంతే కాదు కాస్త గ్లామర్ రోల్స్ తో నిహారిక ని సంప్రదించటానికి కూడా దర్శకులు వెనకాడుతున్నారు...

మొదటినుంచీ చిరు ని, ఆయన తమ్ముళ్ళనీ తమ అన్నయ్యలు గా భావిస్తూ వస్తున్నారు వారి ఫ్యాన్స్ ఈ పరిస్థితుల్లో నిహారిక గ్లామర్ రోల్స్ చేస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే. ఇలాంటి సిట్యుఏషన్ లో తిరిగి లైమ్‌లైట్‌లోకి రావాలన్నా.. రాత్రికిరాత్రే ఓవర్‌నైట్ స్టార్ అయిపోవాలన్నా.. ఖచ్చితంగా స్టార్ హీరోతో ఆమె సినిమా చేయాల్సి ఉంటుంది.

ఇప్పట్లో ఫుల్ జోష్‌మీదున్న స్టార్ హీరో ఎవరైనా ఉన్నారంటే.. ఠక్కున ఎన్టీఆర్ అని చెప్పడంలో సందేహం లేదు. 'టెంపర్', 'నాన్నకు ప్రేమతో', 'జనతా గ్యారేజ్' హ్యాట్రిక్ హిట్స్‌తో ఎనలేని స్థాయికి చేరుకున్నాడు ఎన్టీఆర్. ఇప్పుడు ఇతనితో ఏ హీరోయిన్ నటించినా.. ఆమె స్టార్ ఖచ్చితంగా మారుతుంది.

 Niharika's dream to A movie with Jr. NTR

అందుకే ఇప్పుడు కొత్త ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు నిహారిక ఎన్టీఆర్ తో కలిసి ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉందని ఒక రూమర్ వినిపిస్తొసంది. అయితే ఇది రూమరేనా లేక నిజమా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అంతే కాదు మరీ కాదు గానీ కాస్త పద్దతిగా ఉంటూ గ్లామర్ గా కనిపించే రోల్స్ కి కూడా ఓకే చెప్పే ఆలోచనలో ఉందట నిత్యా మీనన్ చేసిన లాంటి పాత్రలు గ్లమర్ గానే ఉన్నా ఒక యట్టిట్యూడ్ తో ఉండి హుందాగా కనిపిస్తాయి... ఇప్పుడు నీహారిక కూడా అదే దారిలో వెళ్ళాలనుకుంటున్నట్టు టాక్...

ఒక మనసు' సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఫేస్‌బుక్ లైవ్ చాట్‌లో తాను తారక్‌కి వీరాభిమానినని, అతనితో కలిసి నటించాలని ఉందని నిహారిక తన మనసులో మాట చెప్పిన విషయం తెలిసిందే. ఓ స్టార్ హీరో సినిమాలో నటిస్తేనే తనకు క్రేజ్ వస్తుందని భావించిన ఈ మెగా ప్రిన్సెస్ దానికోసం నందమూరి వారబ్బాయి ఎన్టీఆర్ తో సినిమా చేయాలనుకుంటోంది.

గతంలో ఎన్టీఆర్ అంటే ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. మెగాకుటుంబానికి, నందమూరి కుటుంబానికి అభిమానుల సంఖ్య ఎక్కువే కాబట్టి తారక్‌తో కలిసి సినిమా చేస్తే ఖచ్చితంగా తన కెరీర్‌కు ప్లస్ అవుతుందని భావించి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. నీహారిక ఆలోచన బాగానే ఉంది కానీ మరి ఎన్టీఆర్ తనకు ఆ అవకాశం ఇస్తాడో లేదో చూడాలి.

English summary
Mega Daughter named Niharika Konidala has told her opinion that to act with Young Tiger Jr NTR as a heroine. She told her opinion in an interview about acting as a heroine with heroes.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu