»   » మెగా డాటర్... నిహారిక సెకండ్ ఫిల్మ్ మొదలైంది (ఫోటోస్)

మెగా డాటర్... నిహారిక సెకండ్ ఫిల్మ్ మొదలైంది (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా డాటర్ నిహారిక 'ఒక మనసు' సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయిన సంగతి తెలిసిందే. తొలి సినిమా బాక్సాఫీసు వద్ద పెద్దగా వర్కౌట్ కాక పోయినా నిరహారికకు నటన పరంగా మంచి గుర్తింపే తెచ్చి పెట్టింది.

చిన్న బ్రేక్ తర్వాత మళ్లీ ఈ రోజు నిహారిక రెండో సినిమా మొదలైంది. ఫిల్మ్ నగర్ టెంపుల్ లో సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఈ సినిమాకు కొత్త దర్శకుడు రవి దుర్గా ప్రసాద్ దర్శకత్వం వహించబోతున్నారు.

శ్రీకాంత్ క్లాప్

శ్రీకాంత్ క్లాప్

ముహూర్తపు సన్నివేశానికి హీరో శ్రీకాంత్ క్లాప్ కొట్టారు. ఈ కార్యక్రమానికి నాగ బాబు, శ్రీకాంత్, మారుతి, మెహర్ రమేష్ తదితరులు చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.

ఎంఆర్ ఎంటర్టెన్మెంట్స్

ఎంఆర్ ఎంటర్టెన్మెంట్స్

ఎంఆర్ ఎంటర్టన్మెంట్స్, కవితా కంబైన్స్ బేనర్లో ఈచిత్రం తెరకెక్కుతోంది. బండారు బాబీ, మరిశెట్టి రాఘవయ్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

హీరో ఎవరు?

హీరో ఎవరు?

అయితే ఈ సినిమాలో హీరో ఎవరు? అనేది ఇంకా తెలిరాలేదు. అసలు ఈ చిత్రంలో హీరో ఉంటాడో? లేదో? కూడా క్లారిటీ లేదు. కొందరేమో ఉంటాడని, మరికొందరేమో ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ అని అంటున్నారు.

నిహారిక

నిహారిక

నిహారిక సినిమాలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Mega Brother Nagababu’s daughter Niharika Konidela who made her debut with ‘Oka Manasu’ has turned into a disaster. After her debut film, the actress has taken a small break and now back to work. Now she is coming up with her second Telugu film under debutant Ravi Durga Prasad direction.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu