నిహారిక చేతిలో సిగరెట్ ప్యాకెట్.. షూటింగ్‌లో అలా భర్తతో కలిసి సరదాగా..
టాలీవుడ్ మెగా హీరోలు ఎవరికి వారు తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్నారు. ఇక మెగా డాటర్స్ లో నిహారిక సైతం తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంది. యాంకర్ గా, నటిగా ఆమె విభిన్న దారులలో వెళ్లిన విషయం తెలిసిందే కొత్తగా నిర్మాతగా కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇక ఇటీవల ఆమె షూటింగ్ స్పాట్ లో సిగరెట్ ప్యాకెట్ తో కనిపించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Recommended Video

యాంకర్ గా చేసి..
నాగబాబు గారాల కూతురు నిహారిక మొదట యాంకర్ గా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న విషయం తెలిసిందే. ఢీ షోతో మంచి క్రేజ్ కూడా అందుకుంది. తన అల్లరితో మంచి టైమింగ్ ఉన్న యాక్టర్ గా కూడా గుర్తింపు అందుకుంది. ఇక ముద్దపప్పు అవకాయ్, నాన్న కూచి అంటూ విబిన్నంగా వెబ్ సిరీస్ లు చేసింది.

చివరి సినిమా అదే..
హీరోయిన్ గా కూడా కొన్ని సినిమాలు చేసింది. కానీ అవేవి కూడా అనుకున్నంతగా హిట్టవ్వలేదు. ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం వంటి సినిమాల్లో డిఫెరెంట్ యాక్టింగ్ తో మెప్పించిన నిహారిక ఆ తరువాత ఎందుకో లీడ్ రోల్స్ లో నటించలేదు. ఇక చివరగా ఆమె చేసిన సినిమా మాత్రం సైరా నరసింహారెడ్డి. అందులో నిహారిక ఒక గిరిజన అమ్మాయిగా కనిపించింది.

ఇష్టమైన వాడితో వివాహం
ఇక గత ఏడాది పెళ్లి వేడుకతో నిహారిక మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఎంతో ఇష్టంతో పెద్దలు కుదిర్చిన వివాహంతో చైతన్య జొన్నలగడ్డ చేత మూడు మూళ్లు వేయించుకుంది. ఆ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేశారు.

షూటింగ్ లో భర్తతో కలిసి..
ఇక పెళ్లి తరువాత కూడా నిహారిక షూటింగ్స్ తో బిజీగా మారింది. నిర్మాతగా ఉంటూనే ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోంది. అయితే షూటింగ్ లో ఆమె భర్త కూడా తోడుగా ఉంటున్నాడు. భర్తను కూడా నిర్మాణంలో భాగస్వామిగా కలుపుకున్నట్లు సమాచారం. అప్పుడప్పుడు షూటింగ్ కు సంబంధించిన ఫొటోలని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

నిహారిక చేతిలో స్వీట్ సిగరెట్ ప్యాకెట్
ఇక రీసెంట్ గా నిహారిక ఒక సిగరెట్ ప్యాకెట్ ను చేతిలో పెట్టుకొని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. స్వీట్ సిగరెట్ అంటూ సరదాగా పోస్ట్ చేసింది. బహుశా షూటింగ్ లో భాగంగా వాటిని వాడి ఉండవచ్చు. ఇక నిహారిక చేతిలో ప్రస్తుతం రెండు వెబ్ సిరీస్ లు ఉన్నాయి. సినిమాల్లో కూడా మంచి పాత్రల్లో నటించే ఛాన్స్ వస్తే యాక్ట్ చేయాలని అనుకుంటోంది.


Click it and Unblock the Notifications











