»   » ఎటూ తేల్చని చిరంజీవి: పెదనాన్న కోసం నిహారిక అలక!

ఎటూ తేల్చని చిరంజీవి: పెదనాన్న కోసం నిహారిక అలక!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగబాబు కూతురు నిహారిక త్వరలో హీరోయిన్ గా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు' వంటి ప్రేమకథా చిత్రాన్ని అందించిన రామరాజు ఈ చిత్రానికి దర్శకుడు. 'ఒక మనసు' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ శౌర్య హీరో. మధుర శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఈ నెల 18 ఆడియో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. శిల్పకళా వేదికలో ఇందుకు సంబంధించిన వేడుక మెగా అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా చేసేందుకు ప్లాన్ చేసారు.

Also Read: ఒక మనసు... (కొణిదెల నిహారిక-నాగ శౌర్య రొమాంటిక్ ఫోటోస్)

మెగా ఫ్యామిలీ నుండి వస్తున్న తొలి హీరోయిన్ కాబట్టి చిరంజీవి చేతుల మీదుగా ఆడియో వేడుక నిర్వహించడంతో పాటు నిహారికను మెగా అభిమానులకు పరిచయం చేయడం లాంటివి చేస్తే బావుంటుందని భావించారు. అయితే చిరంజీవి ఆడియో వేడుకకు హాజరయ్యే విషయమై ఎటూ తేల్చలేదు. అయితే రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా హాజరవ్వడం మాత్రం ఖరారైంది. చెర్రీతో పాటు బన్నీ, ఇతర మెగా ఫ్యామిలీ హీరోలు కూడా హాజరవుతున్నారు.

Niharika Wants Chiranjeevi

అయితే నిహారిక మాత్రం పెద్దనాన్న చిరంజీవి రావాల్సిందే అంటూ బీష్మించుకుని కూర్చుందట. తండ్రి నాగబాబు సర్ది చెప్పినా అలక వీడటం లేదని అంటున్నారు. అందుకే అన్నయ్య చిరంజీవిని ఎలాగైనా ఈ ఆడియో వేడుకకు రప్పించేందుకు నాగబాబు తన శక్తిమేర ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

చిరంజీవి తన 150వ సినిమాకు సిద్ధమయ్యే పనిలో బిజీగా ఉన్నారు. అందుకే ఆయనకు వీలు కావడం లేదని అంటున్నాయి. అయితే అమ్మాయి కోసం ఒక్కపూట వీలుచేసుకోవాలని మెగా ఫ్యామిలీ మొత్తం కోరుకుంటోంది.

ఈ చిత్రం హెల్తీ ఎంటర్టెన్మెంట్ సబ్జెక్టుతో ఫీల్ గుడ్ గా ఈ సినిమా ఉంటుందని, మెగా ఫ్యామిలీ ఇమేజ్ ఏమాత్రం డ్యామేజ్ కాకుండా, నటిగా నిహారికకు మంచి గుర్తింపు తెచ్చే విధంగా ఉంటుందని అంటున్నారు. మధుర శ్రీధర్, టీవీ 9 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఎక్కువ భాగం షూటింగ్ వైజాగ్ లో జరిగింది. ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించనున్నారు.

English summary
Mega cousins Ram Charan and Allu Arjun are gracing Mega girl Niharika's debut film Oka Manasu audio launch event to be held on May 18th in Shilpakala Vedika, Hyderabad. It is heard that, Niharika wants her peddananna Chiranjeevi to attend the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu