»   » ఫస్ట్ టైం బికీనీ వేసాను : పవన్ హీరోయిన్ ట్వీట్

ఫస్ట్ టైం బికీనీ వేసాను : పవన్ హీరోయిన్ ట్వీట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'పులి' చిత్రం ద్వారా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయిన నికీషా పటేల్, ఆ సినిమా ప్లాపు కావడంతో ఇప్పటి వరకు మళ్లీ తెలుగు తెరపై కనిపించలేదు. ఈ నెల 19న విడుదల కాబోతున్న కళ్యాణ్ రామ్ 'ఓం' 3డి చిత్రం ద్వారా మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

'ఓం' చిత్రంలో నికీషా అందాల ప్రదర్శన అందరికీ ఆకట్టుకోనుంది. ఈ చిత్రంలో ఆమె తన కెరీర్లోనే తొలిసారిగా బికీనీ అందాలతో కనువిందు చేయబోతోంది. ఈ విషయాన్ని నికీషా తన ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించింది. బికీనీలో అమ్మడు ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

ఓం చిత్రంలో కృతి కర్బందా, నికీషా పటేల్‌ హీరోయిన్స్. సునీల్‌రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్‌ బేనర్‌పై కళ్యాణ్ రామే నిర్మిస్తున్నారు. 3డిలో రూపొందుతున్న 'ఓం' ఈ చిత్రానికి హాలీవుడ్ చిత్రాలైన స్టెప్ అప్ 3డి, ఫైనల్ డెస్టినేషన్, అవతార్, స్పైడర్ మ్యాన్ 4 లాంటి చిత్రాలకు పని చేసిన టెక్నీషన్స్ పని చేస్తున్నారు. ఆచు, సాయి కార్తీ సంగీతం అందించారు.

ఈ చిత్రంలో కార్తీక్‌, సురేష్‌, రావు రమేష్‌, రఘు, సితార తదితరులు నటించారు. కూర్పు: గౌతమ్‌రాజు, కళ: కిరణ్‌, స్టీరియోగ్రాఫర్స్‌: డేవిడ్‌ మైక్‌టేలర్‌, మార్కస్‌, మజ జ్డోవిన్‌స్కీ; ఫైట్స్‌: విజయ్‌, రవివర్మ; సంగీతం: అచ్చు, సాయికార్తీక్‌.

English summary
"First time I'm ever wearing a bikini for any film! Complete different attire! Om# releasing 19th!" Nikisha Patel tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu