»   » ‘రుద్రమదేవి’ లొల్లి: గుణ శేఖర్‌ను తప్పుబట్టిన హీరో నిఖిల్!

‘రుద్రమదేవి’ లొల్లి: గుణ శేఖర్‌ను తప్పుబట్టిన హీరో నిఖిల్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇటీవల ‘రుద్రమదేవి' ప్రెస్ మీట్లో దాసరి చేసిన కామెంట్స్ ఎంత దురమారం సృష్టించాయో కొత్తగా చెప్పక్కర్లేదు. రుద్రమదేవి లాంటి చారిత్రక చిత్రం విడుదలైన వారం గ్యాపుతోనే రామ్ చరణ్ ‘బ్రూస్ లీ' సినిమా విడుదల కావడాన్ని తప్పుబట్టారు దాసరి. వాస్తవానికి ‘రుద్రమదేవి' కంటే ముందే ‘బ్రూస్ లీ' రిలీజ్ ఖరారైంది. బ్రూస్ లీ రిలీజ్ ఉంటుందని తెలిసి కూడా గుణశేఖర్ ‘రుద్రమదేవి' సినిమాను విడుదల చేసారు.

మరి ఈ విషయాలన్నీ దాసరికి తెలియవా? తెలిసే ఇలాంటి కామెంట్స్ చేసారా? అనే విషయాలను పక్కన పెడితే..... ఈ వివాదంలో దర్శకుడు గుణశేఖర్ ను అందరూ తప్పుబడుతున్నారు. విడుదల విషయంలో సరైన ప్లానింగ్ లేని ఆయన తీరునుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ ఈ విషయమై స్పందించారు.


Nikhil about Rudramadevi release

అల్లు అర్జున్ మాట్లాడుతూ... రిలీజ్ డేట్ విషయమై బ్రూస్ లీ నిర్మాతను బ్లేమ్ చేయటం పద్దతి కాదు... వారు ఎప్పుడో చాలా కాలం క్రితమే తమ చిత్రం అక్టోబర్ 16న వస్తుందని ఎనౌన్స్ చేసారు. బ్రూస్ లీ రిలీజ్ డేట్ తెలిసే రుద్రమదేవి నిర్మాత అక్టోబర్ 9న విడుదల చేసారు. రెండు చిత్రాలు ఒకేసారి విడుదలైనా బాగా ఆడతాయనే నమ్మకంతో విడుదల చేసారు. ఈ సమయంలో ఎవరూ బ్రూస్ లీ నిర్మాత ను ఈ విషయమై బ్లేమ్ చేయటం పద్దతి కాదు' అన్నారు.


తాజాగా యంగ్ హీరో నిఖిల్... అల్లు అర్జున్ వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచారు. పరోక్షంగా గుణశేఖర్ తీరును తప్పుబట్టారు. రుద్రమదేవి సినిమా విడుదల తేదీ అనేక సార్లు మార్చారు. దాదాపు ఆరు నుండి ఏడు సార్లు రిలీజ్ డేట్ ప్రకటించి సినిమా వాయిదా వేసారు. ఇలా చేయడం వల్ల ఎన్నో డేట్స్ వేస్ట్ అయ్యాయి. ప్రతి సారి ఓ డేట్ ప్రకటించడం, తర్వాత వాయిదా వేయడం చేసారు. గుణశేఖర్ చేసిన ఈ చర్యల వల్ల చాలా చిన్న సినిమాలు సఫర్ అయ్యాయి అని వ్యాఖ్యానించారు. రిలీజ్ విషయంలో సరైన ప్లానింగ్ లేని గుణశేఖర్ వల్లే ఇదంతా జరిగింది అని పలువురు మండి పడుతున్నారు.

English summary
"Several dates have gone wasted because of Rudramadevi changing its dates as they wish. Everyone leaves that date free when they announce. And again a new dates is announced. Small films have had to suffer because of these random date changes." Nikhil said.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu