»   » రామానాయుడుతో 'ఆలస్యం అమృతం' అంటున్న సెక్సీ మదాల్సా

రామానాయుడుతో 'ఆలస్యం అమృతం' అంటున్న సెక్సీ మదాల్సా

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లరి నరేష్ సరసన ఫిట్టింగ్‌ మాస్టర్‌' చిత్రంలో సెక్సీగా కనిపించిన మదాల్సా శర్మ తాజాగా రామానాయుడు చిత్రంలో బుక్కయింది. 'ఆలస్యం అమృతం' టైటిల్ తో ఈ చిత్రం నిర్మితమవుతోంది. 'యువత' ఫేం నిఖిల్‌ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న చిత్రంలో ఆమె హీరోయిన్ గా చేస్తోంది. చంద్రమహేష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రీసెంట్ గా ఆరంభమైంది. కోటి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ ను వైజాగ్‌, అరకు పరిసర ప్రాంతాల్లో 30 రోజుల పాటు జరుపనున్నారు. ఫిట్టింగ్‌ మాస్టర్‌ తర్వాత తమిళంలో 'తంబిక్కు ఇంద ఊరు', కన్నడంలో 'శౌర్య' చిత్రాల్లో నటించారామె. ఈ 'ఆలస్యం అమృతం' చిత్రంతో తెలుగులో ఆమె సెటిలవుతానని భావిస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu