»   » సంచలన రీమేక్‌లో నిఖిల్!.. కేశవకు సీఎం కేసీఆర్, ఎంపీ కవిత ప్రశంస..

సంచలన రీమేక్‌లో నిఖిల్!.. కేశవకు సీఎం కేసీఆర్, ఎంపీ కవిత ప్రశంస..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథాంశాలను హిట్లు సొంతం చేసుకొంటున్న టాలీవుడ్ హీరో నిఖిల్ త్వరలో కన్నడ రిమేక్ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం నిఖిల్ నటించిన కేశవ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తున్నది. ఈ చిత్రం ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం చూసినట్టు తాజా సమాచారం. నిఖిల్ నటించే తదుపరి చిత్రమేమిటంటే..

కిరిక్ పార్టీలో ..

కిరిక్ పార్టీలో ..

కన్నడలో ఇటీవల సంచలన విజయం సాధించిన కిరిక్ పార్టీలో నిఖిల్ నటించడానికి సమ్మతి తెలిపినట్టు తెలిసింది. ఈ చిత్రానికి ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ రాజు సుందరం, నిర్మాత అనిల్ సుంకర నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రొమాంటిక్, కామెడీ చిత్రంగా రూపొందిన కిరిక్ పార్టీ కన్నడంలో భారీ విజయంతోపాటు రికార్డు స్థాయి కలెక్షన్లను రాబట్టి ట్రేడ్ అనలిస్టును ఆశ్చార్యానికి గురిచేసింది. కన్నడ చిత్రానికి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించగా రక్షిత్ శెట్టి, రష్మిక మందన్న, సంయుక్తా హెగ్డే, అరవింద్ అయ్యర్, ధనుంజయ్ రంజన్, ప్రమోద్ శెట్టి ప్రధాన పాత్రల్లో కనిపించారు.


కార్తీకేయ సీక్వెల్‌లో..

కార్తీకేయ సీక్వెల్‌లో..

కేశవ తర్వాత కార్తీకేయ సినిమాకు సీక్వెల్‌లో నటించాలని నిఖిల్ ప్లాన్ చేసుకొన్నాడు. చందు మొండేటి దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఈ సినిమాపై నిర్మాత దిల్ రాజు అధికారికంగా ప్రకటన చేయకపోవడంతో కొంత ఆలస్యం జరిగింది. దిల్ రాజు సతీమణి ఆకస్మిక మరణం వల్ల ఈ చిత్ర ప్రారంభోత్సవం ఆలస్యమైనట్టు సమాచారం.


కేశవకు సీఎం కేసీఆర్ ప్రశంస

కేశవకు సీఎం కేసీఆర్ ప్రశంస

మే 19వ తేదీన రిలీజైన కేశవ చిత్రాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంపీ కవిత.. నిఖిల్ నటించిన కేశవ సినిమాను చూశారు. సినిమా విడుదలైన శుక్రవారం నాడే కేసీఆర్, కవితలకు స్పెషల్ షో వేశారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. సుధీర్ వర్మ సినిమా తీసిన విధానాన్ని కేసీఆర్ మెచ్చుకున్నట్టు సమాచారం. రివేంజ్ క్రైమ్, మర్డర్ మిస్టరీ సాధారణంగా ఉన్నప్పటికి.. డైరెక్టర్ సినిమా ప్రెజెంట్ చేసిన విధానం కేసీఆర్‌కు బాగా నచ్చినట్టు చెబుతున్నారు. హీరో తన ప్రతీకారం తీర్చుకున్న విధానం తెరపై సుధీర్ వర్మ అద్భుతంగా తెరకెక్కించాడని కేసీఆర్, కవిత ప్రశంసించారట.


సీఎంకు, కవితకు నిఖిల్ కృతజ్ఞతలు

సీఎంకు, కవితకు నిఖిల్ కృతజ్ఞతలు

సీఎం కేసీఆర్, కవిత.. కేశవ సినిమా చూడడం పట్ల నిఖిల్ తన సంతోషాన్ని ట్విట్టర్‌లో వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపాడు. కేశవ సినిమా కోసం టైం కేటాయించి, సినిమాను అభినందించిన గౌరవీనీయులైన సీఎం కేసీఆర్, ఎంపీ కవిత గార్లకు కృతజ్ఞతలు చెబుతున్నానంటూ ట్వీట్ చేశాడు నిఖిల్. వారు ఈ సినిమాను చూడటం తనకు గొప్ప అదృష్టంగా భావిస్తాను అని నిఖిల్ ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.English summary
Telugu star Nikhil will be seen soon in a remake after the release of his latest flick, 'Keshava.' He will be collaborating with noted choreographer Raju Sundaram and producer Anil Sunkara for the remake of Kannada movie Kirik Party.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu