»   » నిఖిల్ మార్కెట్ అంత ఉందా?? కొత్తసినిమాకోసం 2.25 కోట్లు+లగ్జరీ కారు ఆఫర్

నిఖిల్ మార్కెట్ అంత ఉందా?? కొత్తసినిమాకోసం 2.25 కోట్లు+లగ్జరీ కారు ఆఫర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ ఇప్పుడు మరీ కాస్ట్లీ అయిపోయింది. వందకోట్ల బడ్జెట్ అంటే ఇప్పుడు మామూలేకదా అన్న అభిప్రాయం నెమ్మది నెమ్మది గా బలపడుతోంది. నిన్నా మొన్నటి వరకూ 40 కోట్ల సినిమా అంటేనే భారీ బడ్జెట్ అనుకున్న టాలీవుడ్ ఇప్పుడు 50 కోట్లైనా లేకుండా ఒక స్టార్ హీరో సినిమా ఎలా? అని ఆలోచిస్తోంది.

మినిమం గ్యారెంటీ

మినిమం గ్యారెంటీ

అయితే ఇప్పుడు మరి చిన్న నిర్మాతల సంగతేమిటీ? ఒక సినిమా మినిమం గ్యారెంటీ ఇస్తుంది అన్న నమ్మకం ఉన్నా 25-30 బడ్జెట్ ఉండాల్సిందే అన్న స్థాయికి చేరుకుంటున్నారు. అలాంటి సమయం లో ఇప్పుడు సినిమాని రెండో స్థాయిలో బతికిస్తున్నది యంగ్ హీరోలే ఒకటేఎ రెండు కోట్ల రెమ్యునరేషన్ తో మినిమం లాభాలను తెచ్చే శర్వానంద్, నాని, నిఖిల్ ఇలా వీరంతా రెండు కోట్లకు మించని వారే.


నిఖిల్ కి ఉన్న మార్కెట్

నిఖిల్ కి ఉన్న మార్కెట్

వీరిని నమ్మిన నిర్మాతలకి నష్టం కూడా చాలా తక్కువ సంధర్భాలలోనే ఉంటోంది. ఎందుకంటే చిన్న సినిమాలవల్ల లాభం ఉండకపోయినా నష్టం కూడా ఎక్కువ ఉండదు. అందుకే టాలీవుడ్ ఇప్పుడు చిన్న హీరోలమీదే ఎక్కువ ఆధారపడుతోంది. ఇప్పుడు నిఖిల్ కి ఉన్న మార్కెట్ నిబట్టీ చూస్తే అదే విషయం అర్థమౌతుంది.


నిఖిల్ వల్ల లాభమే

నిఖిల్ వల్ల లాభమే

నిఖిల్ నుంచి గత ఏడాది వచ్చిన ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా' పెట్టుబడి మీద మూడు రెట్లు వసూలు చేసింది. ఈ మధ్య ‘కేశవ' లాంటి ఏవరేజ్ సినిమాతోనూ నిర్మాతకు మంచి లాభాలు వచ్చాయి. అది కూడా పెట్టుబడి మీద రెట్టింపు షేర్ రాబట్టింది. అంటే నిఖిల్ వల్ల లాభమే తప్ప నష్టం పెద్దగా లేదు.


"కనిదన్" రీమేక్

ఒక వేళ సినిమా ఫ్లాప్ అయినా రెండుమూడు రోజుల్లో పెట్టుబడి చేతికి వచ్చేస్తుంది. అందుకే చాలామంది నిర్మాతలు నిఖిల్ వెంటపడుతున్నారిప్పుడు. నిఖిల్ తమిళం లో హిట్టయిన ‘కనిదన్' రీమేక్ కు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. దీని ఒరిజినల్ నిర్మాత కలైపులి థానునే తెలుగులో చేద్దామనుకుంటున్నారు.


క్రేజీ రెమ్యూనరేషన్

క్రేజీ రెమ్యూనరేషన్

ఐతే రీమేక్ హక్కులు తీసుకుని ఈ చిత్రాన్ని తామే నిర్మిద్దామని చాలామంది నిర్మాతలు ప్రయత్నిస్తున్నారట. ఇందుకోసం నిఖిల్ కు క్రేజీ రెమ్యూనరేషన్ ఆఫర్లు ఇస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. రూ.2.25 కోట్ల డబ్బుతో పాటు లగ్జరీ వోల్వో కారు కూడా ఆఫర్ చేస్తున్నారట.


టీఎన్ సంతోష్

టీఎన్ సంతోష్

ఐతే నిఖిల్ ఏ విషయం తేల్చట్లేదు. ఎవరికి ఓకే చెప్పాలో తెలియక అయోమయంలో ఉన్నాడు. ఐతే అతను ‘కనిదన్' రీమేక్ లో నటించడం మాత్రం పక్కా అంటున్నారు. తమిళ వెర్షన్ కు దర్శకత్వం వహించిన టీఎన్ సంతోషే తెలుగులోనూ డైరెక్ట్ చేసే అవకాశాలున్నాయి.English summary
Nikhil decided to remake Tamil flick 'Kanithan' this time. He promised to offer Rs 2.25 crore & a luxury volvo car as his pay package if the Young Hero does the movie for his banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu