»   » ప్రధానమంత్రి మనవడు సినిమా హీరోగా : 75 కోట్ల బడ్జెట్‌ 2016 బిగ్గెస్ట్ హిట్ ఇదే అవుతుందట

ప్రధానమంత్రి మనవడు సినిమా హీరోగా : 75 కోట్ల బడ్జెట్‌ 2016 బిగ్గెస్ట్ హిట్ ఇదే అవుతుందట

Posted By:
Subscribe to Filmibeat Telugu

మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి తనయుడు నిఖిల్‌ కుమార్‌ హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. 'జాగ్వార్‌' పేరుతో తయారవుతున్న ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్‌ కథను సమకూర్చడం గమనార్హం.

హాలీవుడ్‌ చిత్రాలకు ధీటుగా యాక్షన్‌ సీక్వెన్సెస్‌ని బల్గేరియాకు చెందిన యాక్షన్‌ డైరెక్టర్‌ కలోయాన్‌, ఎన్నో హిట్‌ చిత్రాలకు ఫైట్స్‌ కంపోజ్‌చేసిన రవివర్మ, రామ్‌లక్ష్మణ్‌, సెల్వ ఈ చిత్రంలోని ఫైట్స్‌ని థ్రిల్లింగ్‌గా తెరకెక్కించారు. ముఖ్యంగా బెల్జియంలో కోట్లాది రూపాయల వ్యయంతో చిత్రీకరించిన ఛేజ్‌, ఫైట్‌ ఈ చిత్రంలో స్పెషల్‌ హైలైట్స్‌ అవుతాయి. ఈ చిత్రంలోని అన్ని పాటల్ని 'శ్రీమంతుడు', 'జనతా గ్యారేజ్‌'వంటి భారీ చిత్రాలకు పాటలు రాసిన రామజోగయ్యశాస్త్రి రాశారు.

కన్నడ, తెలుగు భాషల్లో ఏక కాలంలో తయారవుతున్న ఈ చిత్రానికి రాజమౌళి శిష్యుడు ఎ. మహదేవ్‌ దర్శకుడు. చెన్నాంబిక ఫిలిమ్స్‌ పతాకంపై అనితా కుమారస్వామి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, టీజర్‌ను ఆదివారం ఆవిష్కరించనున్నారు. అన్నపూర్ణ ఏడెకరాల స్టూడియోలో వేస్తున్న భారీ సెట్లలో నిర్వహించే షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుందని నిర్మాత తెలిపారు. "జాగ్వార్‌" గురించి మరికొన్ని విశేషాలు స్లైడ్ షో లో

 ప్రధానమంత్రి మనవడు సినిమా హీరోగా : 75 కోట్ల బడ్జెట్‌ 2016 బిగ్గెస్ట్ హిట్ ఇదే అవుతుందట

ప్రధానమంత్రి మనవడు సినిమా హీరోగా : 75 కోట్ల బడ్జెట్‌ 2016 బిగ్గెస్ట్ హిట్ ఇదే అవుతుందట

మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి, నిర్మాత హెచ్‌.డి. కుమారస్వామి తనయుడు నిఖిల్‌కుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ చెన్నాంబిక ఫిలింస్‌ పతాకంపై శ్రీమతి అనితా కుమారస్వామి 'జాగ్వార్‌' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రధానమంత్రి మనవడు సినిమా హీరోగా : 75 కోట్ల బడ్జెట్‌ 2016 బిగ్గెస్ట్ హిట్ ఇదే అవుతుందట

ప్రధానమంత్రి మనవడు సినిమా హీరోగా : 75 కోట్ల బడ్జెట్‌ 2016 బిగ్గెస్ట్ హిట్ ఇదే అవుతుందట

'జాగ్వార్‌'. ఫస్ట్‌లుక్‌, టీజర్‌ని జూలై 31న ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ పార్క్‌ హయత్‌లో తెలుగు సినీ ప్రముఖుల సమక్షంలో రిలీజ్‌ చేస్తున్నారు.

 ప్రధానమంత్రి మనవడు సినిమా హీరోగా : 75 కోట్ల బడ్జెట్‌ 2016 బిగ్గెస్ట్ హిట్ ఇదే అవుతుందట

ప్రధానమంత్రి మనవడు సినిమా హీరోగా : 75 కోట్ల బడ్జెట్‌ 2016 బిగ్గెస్ట్ హిట్ ఇదే అవుతుందట

ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్స్ నే ఎంపిక చేసుకున్నారు 'బాహుబలి', 'భజరంగి భాయ్‌జాన్‌' చిత్రాలతో ప్రపంచమంతటా సంచలనం సృష్టించిన గొప్ప కథా రచయిత విజయేంద్రప్రసాద్‌ ఈ 'జాగ్వార్‌' చిత్రానికి కథ అందించారు. ఎ.మహదేవ్‌ ఈ చిత్రానికి స్క్రిప్ట్‌, మాటలు, దర్శకత్వం చేస్తున్నారు.తమన్‌ సంగీత దర్శకుడు. 'రేసుగుర్రం', 'బ్రూస్‌లీ' వంటి భారీ చిత్రాలకు ఫొటోగ్రఫి చేసినమనోజ్‌ పరమహంస ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తున్నారు

 ప్రధానమంత్రి మనవడు సినిమా హీరోగా : 75 కోట్ల బడ్జెట్‌ 2016 బిగ్గెస్ట్ హిట్ ఇదే అవుతుందట

ప్రధానమంత్రి మనవడు సినిమా హీరోగా : 75 కోట్ల బడ్జెట్‌ 2016 బిగ్గెస్ట్ హిట్ ఇదే అవుతుందట

హాలీవుడ్‌ చిత్రాల స్థాయిలో యాక్షన్‌ సన్నివేశాలను బల్గేరియాకు చెందిన యాక్షన్‌ డైరెక్టర్‌ కలోయాన్‌, ఇంకా రవివర్మ, రామ్‌ లక్ష్మణ్‌, సెల్వ సంయుక్తంగా అందిస్తున్నారు. సెల్వ ఈ చిత్రంలోని ఫైట్స్‌ని థ్రిల్లింగ్‌గా తెరకెక్కించారు. ముఖ్యంగా బెల్జియంలో కోట్లాది రూపాయల వ్యయంతో చిత్రీకరించిన ఛేజ్‌, ఫైట్‌ ఈ చిత్రంలో స్పెషల్‌ హైలైట్స్‌ అవుతాయట.

 ప్రధానమంత్రి మనవడు సినిమా హీరోగా : 75 కోట్ల బడ్జెట్‌ 2016 బిగ్గెస్ట్ హిట్ ఇదే అవుతుందట

ప్రధానమంత్రి మనవడు సినిమా హీరోగా : 75 కోట్ల బడ్జెట్‌ 2016 బిగ్గెస్ట్ హిట్ ఇదే అవుతుందట

ఇందులో జగపతిబాబు ఓ విలక్షణమైన పాత్ర పోషిస్తుండగా, ప్రత్యేక పాత్రలో రమ్యకృష్ణ నటిస్తోంది. దీప్తి నాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, రఘుబాబు, సంపత్, ఆదిత్య మీనన్, సుప్రీత్, రవి కాలే మిగతా పాత్రలను పోషించారు.

 ప్రధానమంత్రి మనవడు సినిమా హీరోగా : 75 కోట్ల బడ్జెట్‌ 2016 బిగ్గెస్ట్ హిట్ ఇదే అవుతుందట

ప్రధానమంత్రి మనవడు సినిమా హీరోగా : 75 కోట్ల బడ్జెట్‌ 2016 బిగ్గెస్ట్ హిట్ ఇదే అవుతుందట

ఆమధ్య పూరీ జగన్నాథ్ దర్శకత్వం లోనే నిఖిల్ తెరంగేట్రం చేయనున్నాడనీ.., ఆ సినిమా నే "రోగ్" అనీ వార్తలు వచ్చాయి. కన్నడ తెలుగు లలో ద్వి భాషా చిత్రంగా ఈ సినిమా నిర్మించబడుతోందంటూ చెప్పారు...

ప్రధానమంత్రి మనవడు సినిమా హీరోగా : 75 కోట్ల బడ్జెట్‌ 2016 బిగ్గెస్ట్ హిట్ ఇదే అవుతుందట

ప్రధానమంత్రి మనవడు సినిమా హీరోగా : 75 కోట్ల బడ్జెట్‌ 2016 బిగ్గెస్ట్ హిట్ ఇదే అవుతుందట

తెలుగులో రామ్ చరణ్ ను చిరుతతో ఇంట్రడ్యూస్ చేసినట్టే.. ఒకప్పుడు కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కొడుకు పునీత్ ను కూడా పూరీనే ఇంట్రడ్యూస్ చేశాడు. మన చరణ్ లాగే పునీత్ కూడా కన్నడలో స్టార్ హీరో అయ్యాడు. దీంతో వారసులకు పూరి డైరెక్షన్ అనే సెంటిమెంట్ పట్టుకుంది. వరుణ్ తేజ్ కూడా పూరి సినిమాతోనే లాంఛ్ అవ్వాల్సింది కానీ.. పూరి బిజీగా ఉండడంతో ఆ ఛాన్స్ శ్రీకాంత్ అడ్డాలకు చేరింది.

 ప్రధానమంత్రి మనవడు సినిమా హీరోగా : 75 కోట్ల బడ్జెట్‌ 2016 బిగ్గెస్ట్ హిట్ ఇదే అవుతుందట

ప్రధానమంత్రి మనవడు సినిమా హీరోగా : 75 కోట్ల బడ్జెట్‌ 2016 బిగ్గెస్ట్ హిట్ ఇదే అవుతుందట

ఈ సెంటిమెంట్ తోనే నిఖిల్ ను హీరోగా ఇంట్రడ్యూస్ చేసే బాధ్యత పూరిపై పెట్టారు. ఆ సినిమా కోసమే ఈ యువహీరో ముంబైలో యాక్టింగ్, థాయ్ లాండ్ లో మార్షల్ ఆర్ట్స్ లోనూ శిక్షణ తీసుకున్నాడట. కానే మధ్యలో ఏమైందో గానీ ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. ఇప్పుడు జాగ్వార్ తోనే తెరమీదికి వచ్చాడు నిఖిల్ కుమార్

 ప్రధానమంత్రి మనవడు సినిమా హీరోగా : 75 కోట్ల బడ్జెట్‌ 2016 బిగ్గెస్ట్ హిట్ ఇదే అవుతుందట

ప్రధానమంత్రి మనవడు సినిమా హీరోగా : 75 కోట్ల బడ్జెట్‌ 2016 బిగ్గెస్ట్ హిట్ ఇదే అవుతుందట

మామూలుగా రాజకీయ వారసత్వం ఉన్న వారంతా యువనేతలు గా మారటానికి ఇష్ట పడుతూంటే నిఖిల్ కుమార్ మాత్రం భిన్నంగా సినిమా ని ఎంచుకున్నాడు. అయితే ఈ ససైనీ గ్లామర్ ని కూడా రాజకీయల్లో వాడుకునేందుకే ఈ ఎత్తా అంటున్న వారూ లేకపోలేదు.

 ప్రధానమంత్రి మనవడు సినిమా హీరోగా : 75 కోట్ల బడ్జెట్‌ 2016 బిగ్గెస్ట్ హిట్ ఇదే అవుతుందట

ప్రధానమంత్రి మనవడు సినిమా హీరోగా : 75 కోట్ల బడ్జెట్‌ 2016 బిగ్గెస్ట్ హిట్ ఇదే అవుతుందట

అన్నపూర్ణ సెవన్‌ ఏకర్స్‌లో వేస్తున్న భారీ సెట్స్‌లో జరిగే షెడ్యూల్‌తో నిర్మాణం పూర్తి చేసుకునే 'జాగ్వార్‌' చిత్రం 2016లో వచ్చే సినిమాల్లో ఓ సెన్సేషన్‌ హిట్‌గా నిలుస్తుందన్న నమ్మకం తో ఉంది జాగ్వార్ టీం.

English summary
Nikhil Kumar aka Nikhil Gowda, son of former CM Kumaraswamy, has entered Kannada film industry as a lead hero.
 
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more