»   » బాగా ఎమోషనల్ అయ్యాం.. ఆల్‌మోస్ట్ ఏడ్చేశాం: భావోద్వేగంగా నిఖిల్..

బాగా ఎమోషనల్ అయ్యాం.. ఆల్‌మోస్ట్ ఏడ్చేశాం: భావోద్వేగంగా నిఖిల్..

Subscribe to Filmibeat Telugu
'కిరాక్ పార్టీ' టీజింగ్ ట్రైలర్ రివ్యూ, భావోద్వేగంగా నిఖిల్..!

హ్యాపీ డేస్ తర్వాత హీరో నిఖిల్ కెరీర్‌లో చాన్నాళ్ల వరకు మళ్లీ హిట్ లేదు. రొటీన్ మూస కథల ఫార్మాట్ నుంచి బయటపడితే గానీ నిఖిల్‍‌ను మళ్లీ హిట్ పలకరించలేదు. అలా స్వామి రారా మొదలు త్వరలో రాబోతున్న 'కిరాక్ పార్టీ' వరకు అన్నీ వైవిధ్యమైన కథలే కావడం గమనార్హం. మూస ఫార్మాట్ తనకు కలిసిరావట్లేదని గ్రహించడమే ఈ హీరో కెరీర్‌లో అతిపెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఇక 'కిరాక్ పార్టీ' టీజింగ్ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా నిఖిల్ కాస్త ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడనే చెప్పాలి..

కాలేజ్ డేస్‌ని గుర్తుచేస్తుంది..:

కాలేజ్ డేస్‌ని గుర్తుచేస్తుంది..:

హ్యాపీ డేస్ తర్వాత తాను కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో నటించిన సినిమా 'కిరాక్ పార్టీ'యే అన్నారు నిఖిల్. ఈ సినిమాలో తనతోపాటు మరో 9మంది నటించారని, అందరూ అద్భుతంగా చేశారని చెప్పాడు. ఈ సినిమా ప్రతి ఒక్కరికీ తప్పకుండా తమ కాలేజ్ డేస్‌ని తిరిగి గుర్తు చేస్తుందన్నారు.

ఆల్‌మోస్ట్ ఏడ్చేశాం:

ఆల్‌మోస్ట్ ఏడ్చేశాం:

షూటింగ్ జరిగినన్ని రోజులు నటీనటులతో మంచి అటాచ్ మెంట్ ఏర్పడిందని, షూటింగ్ చివరి రోజున తామంతా చాలా ఎమోషనల్ అయ్యామని నిఖిల్ తెలిపాడు. ఒకానొక దశలో ఆల్‌మోస్ట్ ఏడ్చేశామని కాస్త భావోద్వేగంగా చెప్పాడు.

తేజ కామెంట్:

తేజ కామెంట్:


'సాధారణంగా అయితే ఇలాంటి వేడుకలకు చివరి నిమిషంలో ఎగ్గొడుతుంటాను. కానీ 'కిరాక్ పార్టీ' వేడుకకు మాత్రం రావాల్సి వచ్చింది. ట్రైలర్ చూస్తే మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తోంది. గడ్డంతోనూ, మామూలుగానూ నిఖిల్ లుక్ చాలా బాగుంది. ఒక్క మిర్చి హేమంత్ తప్ప మిగతావాళ్లందరూ కొత్తగానే ఉన్నారు..' అని దర్శకుడు తేజ కామెంట్ చేశారు.

ఆరోజుల్లో బంక్ కొట్టి మరీ..:

ఆరోజుల్లో బంక్ కొట్టి మరీ..:

తేజ మాట్లాడిన అనంతరం నిఖిల్ ఆయన గురించి మాట్లాడారు. తాను కాలేజీ రోజుల్లో తేజ తీసిన 'జయం', 'నువ్వు నేను' సినిమాలను క్లాసులకు బంక్ కొట్టి మరీ వెళ్లి చూశానని నిఖిల్ చెప్పాడు.

ట్రైలర్ టాక్:

ట్రైలర్ టాక్:

'కృష్ణుడు వచ్చాడ్రా! ఇక కురుక్షేత్రమే'.., 'సీనియర్స్‌లో అమ్మాయిలు 108, మన బ్యాచ్‌లో అమ్మాయిలు 143 ఎవడికి ఎక్కువ పొగరు ఉండాలి' వంటి డైలాగ్స్ కిరాక్ పార్టీ ట్రైలర్ లో బాగా పేలాయి. కళాశాల రాజ‌కీయాల నేప‌థ్యంలో సాగే ఈ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రంలో నిఖిల్ స్టూడెంట్ లీడర్‌గా కనిపించబోతున్నాడు. అంజనీష్‌ లోక్‌నాథ్‌ అందించిన మ్యూజిక్ కూడా ఆకట్టుకునేలా ఉంది.

రిలీజ్ డేట్..:

రిలీజ్ డేట్..:

రిలీజ్ డేట్ ఇంకా ఫిక్స్ చేయనప్పటికీ.. ఫిబ్ర‌వ‌రి నెల‌లోనే విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. 'స్వామిరారా' దర్శకుడు సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. 'కార్తికేయ' దర్శకుడు చందూ మొండేటి ఈ సినిమాకు మాటలు అందిస్తుండటం మరో విశేషం.

పాజిటివ్ బజ్:

పాజిటివ్ బజ్:


నిఖిల్ 'కిర్రాక్ పార్టీ'పై ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. కన్నడలో ఈ సినిమా బంపర్ హిట్ కావడంతో.. ఇక్కడ కూడా మంచి హిట్ సాధిస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు నిఖిల్. కన్నడలో దాదాపు 15 సెంటర్లలో ఈ సినిమా 150 రోజులను పూర్తి చేసుకుంది. అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇక తెలుగులో ఎంతటి విజయాన్ని వరించబోతుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

English summary
Nikhil shared his bonding with his co-stars who helped him a lot on this project. Later, Nikhil said Kirrak Party co-stars made him nostalgic about his past working in happy days. Moreover, he expressed his confidence about Kirrak movie and said this film will connect each and every person.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu