'ఫ్లాట్ ఫారం నెంబర్ 4' కేరాఫ్ ఎడ్రస్ కానున్న నిఖిల్
యువత, హ్యాపీడేస్, కళావర్ కింగ్ చిత్రాలతో పేరు తెచ్చుకున్న నిఖిల్ తాజాగా ఫ్లాట్ ఫారం నెంబర్ ఫోర్ అనే టైటిల్ తో ఓ చిత్రం చేయనున్నాడు. గతంలో ప్రేయసి రావే, హనుమంతు చిత్రాలు రూపొందించిన దర్శకుడు చంద్ర మహేష్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నాడు. ఆగస్టు 16 నుంచి ప్రారంభమయ్యే ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామానాయుడు నిర్మిస్తున్నారు. మధురిమ ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది. సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తయ్యేటట్లు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంభందించిన అఫీషియల్ న్యూస్ రానుంది. ఇక అల్లరి నరేష్ తో బెండు అప్పారావు చేసిన తర్వాత రామానాయుడు నిర్మిస్తున్న చిత్రం ఇదే.
నిఖిల్ రామానాయుడు బెండు అప్పారావు హ్యాపీడేస్ చంద్రమహేష్ nikhil yuvatha chandra mahesh happy days hanumanthu


Click it and Unblock the Notifications