»   » టైటిల్ 'అమల ' కాదు ఇంకోటి, హర్రర్ అంటగా,ఇదిగో ప్రీ లుక్

టైటిల్ 'అమల ' కాదు ఇంకోటి, హర్రర్ అంటగా,ఇదిగో ప్రీ లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరరాబాద్ సినిమాకు టైటిల్ పెట్టడం అంటే మాటలు కాదు. బోల్డు లెక్కలు ఉంటాయి. అయితే అన్నిటికన్నా ముఖ్యంగా జనాల్ని ఎట్రాక్ట్ చేసే వెరైటి టైటిల్ పెడితే ఆ కిక్కే వేరు అని సినీ జనాలకు బాగా తెలుసు. అందుకే సినీ పరిశ్రమ పుట్టిన నాటి నుంచి నిరంతరం విభిన్నమైన టైటిల్స్ వేట కొనసాగుతూనే ఉంది. రీసెంట్ గా పాత సినిమాల్లోని హిట్ పాటల పల్లవుల్ని సైతం సినిమాలకు టైటిల్స్ గా పెడుతున్నారు. తాజాగా నిఖిల్‌కూడా అదే బాట పట్టాడు.

నిఖిల్‌ హీరోగా వి.ఐ ఆనంద్‌ (టైగర్‌ ఫేమ్‌) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. దీనికి 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' అనే టైటిల్‌ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. 'ఆత్మబలం' చిత్రంలో 'ఎక్కడికి పోతావు చిన్నవాడా.. నా చూపుల్లో చిక్కుకున్న కుర్రవాడా' అంటూ ఓ పాట ఉంటుంది. ఇప్పుడు ఆ పాటనే నిఖిల్‌ కూడా గుర్తుచేస్తున్నాడన్నమాట.

అలాగే ఈ చిత్రం హర్రర్ లవ్ స్టోరీ అని, ఇదో ఎక్సపరమెంట్ అని చెప్తున్నారు. అలాగే ఈ చిత్రానికి మొదట అమల అనే టైటిల్ పెడుతున్నట్లు ప్రచారంలోకి వచ్చింది. హీరోయిన్ పేరు అమల అని, ఆమె చుట్టు కథ తిరుగుతుందని చెప్పారు. అయితే ఈ 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' టైటిల్ అయితే క్యాచీగా ఉంటుందని ఫైనలైజ్ చేసారని వినికిడి.

ఇక ఈ చిత్రానికి సంబంధించిన పేరు, ఫస్ట్‌లుక్‌ను జూన్‌ 1న విడుదల చేయనున్నట్లు నిఖిల్‌ వెల్లడించారు. అయితే 'ప్రేమ నుంచి తప్పించుకోలేరు' అంటూ ఓ పోస్టర్‌ను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఆ పోస్టర్‌ను మీరూ చూడండి. ఈ చిత్రంలో హెబ్బాపటేల్‌, నందిత శ్వేత కీలక పాత్రలు పోషిస్తున్నారు.

'శంకరాభరణం' తరవాత నిఖిల్‌ నుంచి వస్తున్న చిత్రమిదే. 'శంకారభరణం' అనుకొన్న ఫలితం తీసుకురాకపోవడంతో ఈ సినిమాపై దృష్టిని కేంద్రీకరించాడు నిఖిల్‌. దాదాపు మూడొంతులు షూటింగ్ పూర్తయింది. ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.

జూన్ 1న నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ విడుదల చేయడానికి చిత్ర బృందం సిద్ధమవుతోంది. ఫాంటసీ జోనర్‌లో రానున్న ఈ చిత్రానికి ఛీఫ్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌: విజయ్‌ కామిశెట్టి, కో-డైరెక్టర్‌: వరప్రసాద్‌ వరికూటి, ఆర్ట్‌: ఎ.రామాంజనేయులు, ఎడిటింగ్‌: చోటా.కె.ప్రసాద్‌, మాటలు: అబ్బూరి రవి, సంగీతం: శేఖర్‌చంద్ర, ఛాయాగ్రహణం: సాయిశ్రీరాం, సహ నిర్మాత: డి.శ్రీనివాస్‌, నిర్మాత: పి.వెంకటేశ్వర్రావు, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: వి.ఐ.ఆనంద్‌

English summary
Presently Nikil is doing a film under the direction of VI Anand, who worked as an assistant under AR Murugadoss. They have finalized another title ‘Ekkadiki Potavu Chinnavaada’ as per the latest update.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu