»   »  ఏదో టెన్షన్ లేకపోతే నా సినిమాలు హిట్ కావు.. అదే నాకు సెంటిమెంట్.. నిఖిల్

ఏదో టెన్షన్ లేకపోతే నా సినిమాలు హిట్ కావు.. అదే నాకు సెంటిమెంట్.. నిఖిల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

విభిన్నమైన కథలను ఎంచుకొంటూ, వరుస సక్సెస్‌లతో దూసుకెళ్తున్నాడు యువ హీరో నిఖిల్ సిద్ధార్థ్. ప్రతీ సినిమాను దేనికదే కొత్తగా ప్లాన్ చేసుకొంటున్నాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం కిరాక్ పార్టీ. కన్నడంలో ఘన విజయం సాధించిన కిరాక్ పార్టీని అదే పేరుతో తెలుగులో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మార్చి 16న విడుదల చేస్తున్నట్టు నిర్మాత అనిల్ సుంకర బుధవారం ప్రకటించారు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ తన సినిమాల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

 టెన్షన్ నడుమ సినిమా

టెన్షన్ నడుమ సినిమా

నా ప్రతీ సినిమాకు ముందు ఓ టెన్షన్ ఉంటుంది. ఆ టెన్షన్‌ మధ్యనే నా సినిమా రిలీజై ఘనవిజయం సాధిస్తున్నాయి. కిరాక్ పార్టీ కూడా అదే సెంటిమెంట్‌ను కొనసాగిస్తుందని భావిస్తున్నాను అని నిఖిల్ తెలిపారు.

 నోట్ల రద్దు సమయంలో

నోట్ల రద్దు సమయంలో

నా సినిమా రిలీజ్‌కు ముందు ఏదో ఒక సంక్షోభం లాంటిది వస్తుంటుంది. ఎక్కడికి పోతావు చిన్నదానా చిత్రానికి ముందు నోట్ల రద్దు అంశం దేశాన్ని కుదిపేసింది. ఆ సందర్భంగానే నా సినిమా రిలీజై విజయం సాధించింది.

దక్షిణాదిలో సమ్మె తర్వాత

దక్షిణాదిలో సమ్మె తర్వాత

ఇప్పుడు కిరాక్ పార్టీకి ముందు దక్షిణాది సినిమా పరిశ్రమలో సమ్మె నడించింది. దక్షిణాది వ్యాప్తంగా సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ఇలాంటి సంక్షోభం తర్వాత నా సినిమా విడుదలవుతున్నది. ఇలాంటి నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం కూడా సెంటిమెంట్ ప్రకారం సక్సెస్ సాధిస్తుందని భావిస్తున్నాను అని నిఖిల్ తెలిపారు.

కంటతడి పెట్టించే కిరాక్ పార్టీ

కంటతడి పెట్టించే కిరాక్ పార్టీ

కిరాక్ పార్టీ చిత్రం శివ, హ్యాపీడేస్ నుంచి స్పూర్తి పొంది తెరకెక్కించాం. ఈ చిత్రంలో కాలేజీలో గ్యాంగ్ వార్స్ మాత్రమే కాకుండా బోలెడంత వినోదం కూడా ఉంటుంది. ఈ చిత్రం ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టిస్తుంది. అందరూ ఈ సినిమాను చూసి తమ కాలేజీ లైఫ్‌లోకి వెళ్లిపోతారు అని నిఖిల్ అన్నారు.

English summary
Kirrak Party is a 2018 Indian Telugu language campus romantic comedy film directed by Sharan Koppisetty and produced by Ramabrahmam Sunkara under AK Entertainments banner. The film is the remake of the most successful Kannada film Kirik Party which was directed by Rishab Shetty. The film features Nikhil Siddharth in the lead role along with Simran Pareenja, making her debut and Samyuktha Hegde reprising her role from the Kannada version.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu