»   »  సీక్రెట్ కెమెరాలతో హల్‌చల్ చేయబోతున్న హీరో నిఖిల్!

సీక్రెట్ కెమెరాలతో హల్‌చల్ చేయబోతున్న హీరో నిఖిల్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ తన తర్వాతి సినిమాలో సీక్రెట్ కెమెరాలు, స్పై కెమెరాలతో హల్ చల్ చేయబోతున్నారు. తమిళ దర్శకుడు టిఎన్ సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో నిఖిల్ ఇన్వెస్టిగేటివ్ టీవీ జర్నలిస్టు పాత్రలో కనిపించబోతున్నాడు.

కోలీవుడ్లో 2016లో 'కనితన్' అనే సినిమా వచ్చి సూపర్ హిట్ అయింది. ఇదే చిత్రాన్ని ఇపుడు తెలుగులో రీమేక్ చేస్తున్నారు. కనితన్ దర్శకుడు టిఎన్ సంతోష్ తెలుగు రీమేక్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు.

Nikhil to play TV journalist in next

'ప్రస్తతం రోజుల్లో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రజల జీవితాల్లో ఎంతో కీలకంగా మారింది. నాకు చాలా మంది జర్నలిస్టులతో పరిచయం ఉంది. వారు తమ ఇన్వెస్టిగేషన్స్, స్టింగ్ ఆపరేషన్స్‌లో వాడే సీక్రెట్ కెమెరాల గురించి అడిగి తెలుసుకుంటూ ఉంటాను. సామాజిక సమస్యలపై పోరాడే జర్నలిస్టు పాత్ర చేయడం ఎంతో ఎగ్జైటింగ్ గా ఉంది' అని నిఖిల్ తెలిపారు.

వేధింపులు తప్పలేదు.. నిఖిల్‌తో అఫైర్

ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ ఇటీవలే హైదరాబాద్ లో ప్రారంభం అయింది. గ్రిప్పింగ్ స్టోరీ లైన్, బలమైన సోషల్ మెసేజ్ తో రూపొందుతున్న ఈచిత్రానికి ప్రేక్షకుల నుండి మంచిస్పందన వస్తుందని ఆశిస్తున్నారు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ కూడా కీలకమైన పాత్రలో కనిపించబోతున్నారు. దీని తర్వాత నిఖిల్ కార్తీకేయ సీక్వెల్ చేయబోతున్నారు. మే నెలలో ఈ చిత్రం ప్రారంభం కాబోతోంది.

English summary
Actor Nikhil He finished Kirrak Party and the movie is expected to release in the month of March. Immediately, without taking much break, he started working on his next film, Kanithan remake. TN Santhosh, who directed the original is directing this movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu