»   » సమాధానం దొరకలేదంటే లోపం ప్రశ్నది కాదు...ప్రయత్నానిదే అంటున్న నిఖిల్

సమాధానం దొరకలేదంటే లోపం ప్రశ్నది కాదు...ప్రయత్నానిదే అంటున్న నిఖిల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నిఖిల్, స్వాతి జంటగా రూపొందిన 'స్వామి రారా' చిత్రం ఇటీవల విడుదలై విజయవంతమైన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్లో రాబోతున్న మరో సినిమా 'కార్తికేయ'. మాగ్నస్ సినీ ప్రైమ్ పతాకం పై వెంకట శ్రీనివాస్ బొగ్గారం నిర్మిస్తున్న ఈచిత్రం ఒక పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది.

ఈ చిత్రం ద్వారా చందు మొండేటి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ధ్రిల్లర్‌తో కూడిన వినొదాత్మక చిత్రంగా దీనికి రూపకల్పన చేస్తున్నట్లు చిత్ర దర్శకుడు చందు మొండేటి తెలిపారు. చిత్ర నాయకా, నాయికలు వైద్య విద్యార్ధులుగా కనిపిస్తారీ చిత్రంలో.. ఈ ప్రపంచంలో సమాధానం దొరకని ప్రశ్న అంటూ ఉండదు.. ఒక వేళ సమాధానం దొరకలేదు అంటే ఆ లోపం ప్రశ్నది కాదు, ప్రయత్నానిదే అని నమ్మే మనస్తత్వం చిత్ర కధానాయకుడు 'నిఖిల్'ది. ఈ నేపథ్యంలో అతనికి ఎదురైన సంఘటనలు, సన్నివేశాల సమాహారమే ఈ 'కార్తికేయ' చిత్రం.

స్లైడ్ షోలో సినిమాకు సంబంధించినమరిన్ని వివరాలు, ఫోటోలు.....

నిఖిల్ మాట్లాడుతూ..

నిఖిల్ మాట్లాడుతూ..


ఈ చిత్రం గురించి నిఖిల్ మాట్లాడుతూ.... ఇది ఎంటర్ టైన్మెంట్ బేస్ గా ఉంటుంది, ముఖ్యంగా సామర్లకోట దగ్గరలోని బెమ్మేశ్వరాలయం చుట్టూ జరిగే కథ ఇది. అన్ని కమర్షియల్ అంశాలు ఉన్న ఈ చిత్రం నాకు స్వామి రా రా తరువాత మంచి హిట్ ఇస్తుందన్న నమ్మకం ఉంది అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ...

దర్శకుడు మాట్లాడుతూ...


పూర్తి వినోదాత్మకంగా సినిమా సాగుతుంది. వైజాగ్, అరకు, సామర్ల కోటలోని భీమేశ్వరాలయంలో షూటింగ్ జరిపాం. గుడి నేపథ్యంలో సాగే కథ ఇది. అయితే హిస్టారికల్, పీరియాడికల్ మాత్రం కాదు అని తెలిపారు.

అందరికీ నచ్చే విధంగా...

అందరికీ నచ్చే విధంగా...


థ్రిల్లర్ కథాంశంతో కూడిన ఈ సినిమా ఎంటర్టెన్మెంట్, లవ్, ఫ్యామిలీ సెంటిమెంటుతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది దర్శకుడు చెబుతున్నారు.

విడుదల ఎప్పుడు?

విడుదల ఎప్పుడు?


నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గారం మాట్లాడుతూ...‘ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయిందని, నిర్మాణానంతర కార్యక్రమాలు త్వరలో పూర్తి చేసి మార్చి మొదటి వారంలో ఆడియో, మార్చి చివరి వారంలో సినిమాను విడులల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

నటీనటులు

నటీనటులు


ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో తనికెళ్ల భరణి, రావు రమేష్, శ్రీనివాస్ రెడ్డి, తులసి, కిషోర్, జోగి నాయుడు, తాగుబోతు రమేష్, పృథ్వి, గౌతం రాజు, శివన్నారాయణ, స్వామి రారా సత్య, గిరి తదితరులు నటిస్తున్నారు.

టెక్నీషియన్స్

టెక్నీషియన్స్


కెమెరా : కార్తిక్, సంగీతం : శేఖర్ చంద్ర, ఎడిటింగ్ : కార్తిక శ్రీనివాస్, ఆర్ట్ : సాహి సురేష్, పాటలు : కృష్ణ చైతన్య, కొరియోగ్రఫీ : రఘు, ఫైట్స్ : వెంకట్ నాగు, సమర్పణ : శిరువూరి రాజేష్ వర్మ, నిర్మాత : వెంకట శ్రీనివాస్ బొగ్గరం, కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : చందు మొండేటి.

English summary
Nikhil and Swathi had recently scored a hit with Swamy Ra Ra and the duo is back for another film that has been titled Karthikeya. This movie is getting ready for a release in the last week of March. Chandu Mondet is the director of this movie and this is his first film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu