For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మరోసారి విభిన్నంగా... ( ‘సూర్య vs సూర్య’ ప్రివ్యూ)

  By Srikanya
  |

  హైదరాబాద్ :నిఖిల్ చిత్రం అంటే ఓ విభిన్న కథాంశం ఉంటుందనే పేరుని తెచ్చుకునే ప్రయత్నంలో చేస్తున్న వరస సీరిస్ చిత్రం ఇది. రెగ్యులర్ చిత్రాలుకు భిన్నంగా సాగే కథాంసంతో ఈ చిత్రం రెడీ అయ్యింది. కథ హీరోగా రూపొందిన చెప్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా నిఖిల్ గత చిత్రం కార్తికేయకు పనిచేసిన వారే పనిచేయటం సినిమాకు ప్లస్ అయ్యింది.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  ఎ కండిషన్ రిలేటెడ్ టు ప్రోఫ్ ఏరియా అంటే పగటి పూట బయటకి రాలేకపోవడం. ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని వస్తున్న చిత్రం ఇది. పగలు బయటకు రాలేని ఓ కుర్రాడు.. పగలు అంటే ఇష్టపడే అమ్మాయితో ప్రేమలో ఎలా పడ్డాడు. అనే ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. సూర్య కాంతిని తట్టుకోలేని పార్ఫీనియా అనే అరుదైన వ్యాధితో బాధపడే కుర్రాడి పాత్రలో నిఖిల్ కనిపించారు. సూర్యకు శత్రువు సూర్యుడే. ఆ కిరణాలు చురకత్తుల్లా వెంటాడుతుంటాయి. యమపాశంలా భయపెడతాయి. ఎందుకు? ఏమిటి? ఎలా అనే విషయాలు తెలియాలంటే 'సూర్య వర్సెస్‌ సూర్య' చూడాల్సిందే. సినిమాలో సస్పెన్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటాయి.

  Nikhil Siddhartha's 'Surya vs Surya' preview

  'హ్యాపీ డేస్' తర్వాత మరోసారి నిఖిల్ కాలేజ్ నేపధ్యంలో చేస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘సూర్య vs సూర్య'. ఈ సినిమాతో ‘ప్రేమ ఇష్క్ కాదల్', ‘కార్తికేయ' సినిమాల సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘కార్తికేయ' దర్శకుడు చందు మొండేటి డైలాగ్స్ అందించారు. ఈ సినిమాతో నిఖిల్ హట్రిక్ పై కన్నేశారు.

  నిఖిల్‌ మాట్లాడుతూ ''తొలిసారి ఓ విభిన్నమైన ప్రేమకథా చిత్రంలో నటించాను. 'స్వామిరారా' హోలీ రోజున విడుదలైంది. 'కార్తికేయ' దీపావళికి వచ్చింది. పండగ రోజున విడుదలైన రెండు సినిమాలూ మంచి విజయం సాధించాయి. ఈ చిత్రాన్నీ హోలీ రోజునే తీసుకొస్తున్నాం'' అన్నారు.

  దర్శకుడు చెబుతూ ''సత్యమహావీర్‌ అందించిన పాటలన్నీ శ్రోతల ఆదరణ పొందుతున్నాయి. సూర్యుడికీ, సూర్యకీ జరిగే సంఘర్షణ అందరినీ ఆకట్టుకొంటుంది''అన్నారు.

  ''చిత్రబృందం అంతా కష్టపడింది. 'ఇది మన సినిమా' అనుకొని పనిచేశారు. దర్శకుడు కథ ఎంత బాగా చెప్పాడో, దానికంటే వంద రెట్లు బాగా తీశాడు''అన్నారు నిర్మాత.

  బ్యానర్:సురక్షా ఎంటర్టైన్మెంట్స్
  నటీనటులు:నిఖిల్, త్రిధా చౌదరి ,తనికెళ్ల భరణి, మధుబాల, రావురమేష్, షాయాజీ షిండే, తా.రమేష్, రాజా రవీంద్ర, ప్రవీణ్, సత్య, మస్త్‌అలీ, అల్లరి సుభాషిణి, జెన్నీ తదితరులు
  సంగీతం:సత్య మహావీర్,
  కెమెరా:కార్తీక్ ఘట్టమనేని,
  మాటలు: చందూ మొండేటి,
  ఎడిటింగ్:గౌతమ్ నెరుసు,
  పాటలు: రామజోగయ్య శాస్ర్తీ, శ్రీమణి, కృష్ణచిన్ని,
  నిర్మాత: మల్కాపురం శివకుమార్,
  రచన, దర్శకత్వం: కార్తీక్ ఘట్టమనేని.
  విడుదల తేదీ: 05,మార్చి 2015.

  English summary
  Nikhil Siddhartha, who has scored back-to-back hits with "Swamy Ra Ra" and "Karthikeya", is now returning to the big screen with "Surya vs Surya", which is releasing in theatres on 5 March.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X