»   » ఆయనే నాకు దేవుడు, నంబర్ "గాడ్" అని సేవ్ చేస్కున్నా : నిఖిల్ "గాడ్" ఎవరు?? (ఫొటోలు)

ఆయనే నాకు దేవుడు, నంబర్ "గాడ్" అని సేవ్ చేస్కున్నా : నిఖిల్ "గాడ్" ఎవరు?? (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

"క్యాహువా మున్నా భాయ్..! మై క్యా బోలూ తెరేకూ" అంటూ హైదరాబాద్ నవాబ్స్ అనే లోకల్ సినిమాలో బైక్ పై వచ్చే కుర్రాడు ఎవ్వరికీ గుర్తు లోఅకపోవచ్చు కానీ.., శేఖర్ ఖమ్ముల తీసిన హ్యాపీ డేఅస్ లో "మా అయ్య పొద్దుటూరు ఎమ్మెల్యే" అంటూ రాయల సీమ ఎమ్మెల్యే కొడుకైనా తెలంగాణా యాసలో ఇరగదీసిన నిఖిల్ చాలా మందికే గుర్తుండి పోయాడు. నిజానికి హ్యాపీడేస్ నిఖిల్ మొదటి సినిమా అనుకుంటారు ఎందుకంటే ఒక నటుడు గా అతన్ని ఇండస్ట్రీలో నిలబడటానికి ఇవాళ ఒక హీరో గా తనకంటూ ఒక బేస్ ని ఇచ్చిన సినిమా అది...

నేటికి పదేళ్లు

నేటికి పదేళ్లు

నిఖిల్ సినీ ఎంట్రీ ఇచ్చి నేటికి పదేళ్లు. పదేళ్ల క్రితం శేఖర్ కమ్ముల తీసిన హ్యాపీడేస్ చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నిఖిల్. ఆ సినిమా ద్వారా చాలా మంది కొత్త కుర్రాళ్లు పరిచయమైనా.. నిలదొక్కుకోవడానికి ఇప్పటికీ వాళ్లు ఆరాటపడుతూనే ఉన్నారు.

చాలా వరకు ఫ్లాపులే

చాలా వరకు ఫ్లాపులే

నిఖిల్ కూడా తొలుత సినిమాల ఎంపికలో తప్పటడుగులు వేసినా.. ఆ తర్వాత రూటు మార్చి తనకు తగిన కథలను ఎంచుకుని అందులో సక్సెస్ అయ్యారు. నిజానికి స్వామిరారా సినిమా వరకు నిఖిల్‌ను చాలా వరకు ఫ్లాపులే పలకరించాయి. అయినా ఎప్పుడూ నిరాశ పడలేదు.

హీరో

హీరో

తన తోనే అదే సినిమాలో చేసిన వరుణ్ సందేశ్, రాహుల్ ల్ లు ఇంకా సరైన కెరీర్ లో పడలేదు కానీ నిఖిల్ మాత్రం ఇవాళ ఒక హీరో. ప్రతీ సారీ కిందపడుతూ మళ్ళీ లేస్తూ తనకు తాను నిలబెట్టుకుని హీరో అయ్యాడీ కుర్రాడు. ఔను నిఖిల్ కి సిక్స్ ప్యాక్ లేదు, మరీ అంత అందగాడా అంటే కాదు..,

ఇంత కాంపిటీషన్ లో ఎలా నిలబడ్డాడు

ఇంత కాంపిటీషన్ లో ఎలా నిలబడ్డాడు

పోనీ బ్యాక్ గ్రౌండ్ బలంగా ఉందా అంటే అదీ లేదు మరి ఇంత కాంపిటీషన్ లో ఎలా నిలబడ్డాడు? అంటే కేవలం తన అర్హతని బట్టే "నటన" అనే అర్హతే ఇవాళ నిఖిల్ ని ఈ స్థాయిలో నిలబెట్టింది. ఈ పదేళ్ళలో నిఖిల్ కి ఫ్లాపులు వచ్చాయ్, అట్టర్ ఫ్లాప్ సినిమాలూ ఉన్నాయ్ కానీ ఏ సినిమాలోనూ తాను నటుడిగా ఫేయిల్ అవ్వలేదు... ఆ ఒక్క క్వాలిటీ నే అతని అర్హత, అతని బలం, అతని ఫ్యాషన్...

శేఖర్ ఖమ్ములని దేవుడిగానే భావిస్తాడట

శేఖర్ ఖమ్ములని దేవుడిగానే భావిస్తాడట

అయితే ఇప్పటికీ తనకు లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ ని మర్చిపోలేదు, లైఫ్ ఇచ్చిన వాన్ని దేవుడనే కదా అంటారు అలా హ్యాపీడేస్ తో తనకి నటుడి గా జీవితాన్నిచ్చిన శేఖర్ ఖమ్ములని దేవుడిగానే భావిస్తాడట నిఖిల్. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అయిన సందర్భంగా నిఖిల్ ఓ చిన్న పార్టీని ఏర్పాటు చేశాడు.

శేఖర్ సార్ గాడ్

శేఖర్ సార్ గాడ్

ఈ ఫంక్షన్‌కు తనతో పనిచేసిన డైరెక్టర్లందరినీ ఆహ్వానించారు. కేక్ కట్ చేశారు. ‘‘ఎన్నో సినిమాల ఆడిషన్లకు వెళ్లాను. కానీ, అవకాశాలు తలుపు తట్టలేదు. ఇండస్ట్రీలోకి ఎలా అడుగు పెట్టాలో తెలియక సతమతమవుతున్న రోజుల్లో శేఖర్ కమ్ముల గారు నాకు దేవుడిలా అవకాశం ఇచ్చారు. ఆయన్ను ఎప్పటికీ మరచిపోలేను. అందుకే ఆయన పేరును నా ఫోన్లో ‘శేఖర్ సార్ గాడ్' అని సేవ్ చేసుకున్నాను'' అని చెప్పిన నిఖిల్.. శేఖర్ కమ్ములకు ధన్యవాదాలు చెప్పాడు.

ఒక్క సీన్‌తోనే

ఒక్క సీన్‌తోనే

ఇక, హ్యాపీడేస్ ఆడిషన్స్ సమయంలో ఒక్క సీన్‌తోనే నిఖిల్‌ను ఓకే చేశానంటూ శేఖర్ కమ్ముల ఆ నాటి సంఘటనను గుర్తు చేశారు. నిఖిల్ ఆడిషన్స్ కి రావటం తాను అనుకున్న పాత్రకి సరిగ్గా సరిపోయే బాడీ లాంగ్వేజ్, నటనలో ఈజ్ చూసాక ఈ పాత్రకి నిఖిల్ తప్ప మరెవరూ న్యాయం చేయలేరు అనిపించిందేమో మరి. అలా ఒక హీరోని ఇండస్ట్రీ లైం లైట్ లోకి తెచ్చాడు శేఖర్...

English summary
Nikhil Emotional Speech about His Film Journey From Hyappy days To Keshava
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu