Just In
- 8 min ago
KRACK వివాదం.. దిల్ రాజు గురించి మాట్లాడే అర్హతే లేదు.. బెల్లంకొండ సురేష్ కామెంట్స్
- 1 hr ago
క్రాక్ ఓటీటీ రిలీక్ డేట్ ఫిక్స్.. ఎప్పుడు రాబోతోందంటే?
- 1 hr ago
ఇన్నేళ్లకు ఆ విషయం తెలిసింది.. ఇకపై నేనేంటో చూపిస్తా.. రామ్ కామెంట్స్ వైరల్
- 1 hr ago
సలార్ సినిమాకు హీరోయిన్ టెన్షన్.. వాళ్ళు ఖాళీగా లేరట
Don't Miss!
- News
తిరుమలలో అపచారం: ఎక్కడి నుంచి వచ్చాయో గానీ: శ్రీవారి ఆలయం వద్ద తిష్ఠ: భక్తుల అసహనం
- Sports
యువరాజ్ సింగ్ పంచుకున్న భరతనాట్యం బౌలింగ్.. చూస్తే వావ్ అనాల్సిందే!వీడియో
- Finance
startup India seed fund: స్టార్టప్స్ కోసం రూ.1000 కోట్ల నిధి
- Automobiles
కోటి రూపాయల ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రముఖ టీవీ నటి!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు జనవరి 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రేపే టీజర్ రిలీజ్
హైదరాబాద్ : స్వామి రా రా', 'కార్తికేయ', 'సూర్య వర్సెస్ సూర్య'... ఇలా వరుస విజయాలు అందించిన ఉత్సాహంలో ఉన్నాడు నిఖిల్. ఇప్పుడు 'శంకరాభరణం' అనే మరో వినూత్న కథతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రంతో ఉదయ్ నందనవనమ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ విజుువల్ టీజర్ ని రేపు పవన్ కళ్యాణ్ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని నిఖిల్... ఖరారు చేస్తూ ట్వీట్ చేసారు. ఎంవీవీ సత్యనారాయణ నిర్మాత.
The 1st Luk Visual Teaser of #ShankaraBharanam is going 2 be Unveiled by none other than my Favourite THE POWER STAR @PawanKalyan annaya_/\_
— Nikhil Siddhartha (@actor_Nikhil) October 13, 2015
ఈ చిత్రంలో హీరోయిన్ గా నందితను ఎంచుకొన్నారు. ఓ ప్రత్యేక పాత్రలో అంజలి నటించనుంది. క్రైమ్ కామెడీ జోనర్‌లో సాగే కథ ఇది. సంపత్‌రాజ్, బ్రహ్మానందం, రఘుబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించిన కోన వెంకట్ సమర్పకుడిగానూ వ్యవహరిస్తున్నారు. అదే విషయాన్ని ఖరారు చేస్తూ చిత్ర రచయిత కోన వెంకట్ సైతం ట్వీట్ చేసారు.
Powerstar is going to release the 1st teaser of "Shankarabharanam" tmrw mrng.. My heart full thanks to him 🙏
— kona venkat (@konavenkat99) October 13, 2015
స్కై హై ఫిల్మ్స్ వారు నా శంకరాభరణం చిత్రం ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారు. ఆడియన్స్ కు మేము మంచి ప్రొడక్ట్ ని ఇస్తామని ఆశిస్తున్నాము అన్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
నిఖిల్ లుక్, బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాలో స్టైలిష్ గా ఉంటాయంటున్నారు. అమెరికాలో విలాసవంతమైన జీవితం అనుభవించే కుర్రాడు.. అనుకోని పరిస్థితుల్లో ఇండియా వచ్చి బీహార్లో చిక్కుకోవడం నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండబోతోందట. దీంతో రీసెంట్ గా ఓ షెడ్యూల్ ను బీహార్ లోనూ పూర్తి చేశారు. మరి డిఫరెంట్ మూవీస్ తో వరుస విజయాలు అందుకుంటున్న నిఖిల్ ఖాతాలో... ఈ శంకరాభరణం కూడా మరో విజయంగా నిలుస్తుందేమో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.