»   » పవన్ కళ్యాణ్ రిలీజ్ చేసారు..ఇదిగో టీజర్ (వీడియో)

పవన్ కళ్యాణ్ రిలీజ్ చేసారు..ఇదిగో టీజర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ముందుగా ప్రకటించినట్లుగానే నిఖిల్ తాజా చిత్రం శంకరాభరణం' చిత్రం ఫస్ట్ లుక్ విజుువల్ టీజర్ ని ఈ రోజు ఉదయం పవన్ కళ్యాణ్ విడుదల చేసారు. ఎంవీవీ సత్యనారాయణ నిర్మాత. ఇదిగో టీజర్ ఎంజాయ్ చేయండి.

Nikil's Film Sankarabharanam Teaser

స్వామి రా రా', 'కార్తికేయ', 'సూర్య వర్సెస్‌ సూర్య'... ఇలా వరుస విజయాలు అందించిన ఉత్సాహంలో ఉన్నాడు నిఖిల్‌. ఇప్పుడు 'శంకరాభరణం' అనే మరో వినూత్న కథతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రంతో ఉదయ్‌ నందనవనమ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.


ఈ చిత్రంలో హీరోయిన్ గా నందితను చేస్తోంది. ఓ ప్రత్యేక పాత్రలో అంజలి నటించనుంది. క్రైమ్‌ కామెడీ జోనర్‌లో సాగే కథ ఇది. సంపత్‌రాజ్‌, బ్రహ్మానందం, రఘుబాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు అందించిన కోన వెంకట్‌ సమర్పకుడిగానూ వ్యవహరిస్తున్నారు. స్కై హై ఫిల్మ్స్ వారు నా శంకరాభరణం చిత్రం ఓవర్ సీస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్నారు. ఆడియన్స్ కు మేము మంచి ప్రొడక్ట్ ని ఇస్తామని ఆశిస్తున్నాము అన్నారు.


ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


Nikil's Film Sankarabharanam Teaser

నిఖిల్ లుక్, బాడీ లాంగ్వేజ్ ఈ సినిమాలో స్టైలిష్ గా ఉంటాయంటున్నారు. అమెరికాలో విలాసవంతమైన జీవితం అనుభవించే కుర్రాడు.. అనుకోని పరిస్థితుల్లో ఇండియా వచ్చి బీహార్లో చిక్కుకోవడం నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండబోతోందట. దీంతో రీసెంట్ గా ఓ షెడ్యూల్ ను బీహార్ లోనూ పూర్తి చేశారు. మరి డిఫరెంట్ మూవీస్ తో వరుస విజయాలు అందుకుంటున్న నిఖిల్ ఖాతాలో... ఈ శంకరాభరణం కూడా మరో విజయంగా నిలుస్తుందేమో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

English summary
Sankarabharanam Teaser Launched by Power Star Pawan Kalyan. Sankarabharanam Teaser launched by Power Star Pawan Kalyan. Sankarabharanam movie features Nikhil, Nanditha. Produced by Kona Venkat, directed by Uday Nandanavanam and music composed by Praveen Lakkaraju.
Please Wait while comments are loading...