»   »  'శంకరాభరణం' సాంగ్‌ మేకింగ్‌ (వీడియో)

'శంకరాభరణం' సాంగ్‌ మేకింగ్‌ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: నిఖిల్‌, నందిత, అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన 'శంకరాభరణం' చిత్రంలోని 'తూరుపే..' అనే పాట మేకింగ్‌ వీడియో విడుదలైంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత కోన వెంకట్‌ తన ట్వీట్ ద్వారా తెలిపారు. ఉదయ్‌ నందనవనం దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరో ప్రక్క 'శంకరాభరణం' చిత్రాన్ని కెనడాలో ప్రదర్శించటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే విషయాన్ని సినిమా నిర్మాత కోన వెంకట్‌ ఈ విషయాన్ని తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు దానికి సంబందించినా ట్వీట్ ని ఇక్కడ మీరు చూడవచ్చు..


కెనడాలోని తెలుగు వారికి వినోదం పంచడం కోసం సినిమాని అక్కడ ప్రదర్శిస్తున్నట్లు పేర్కొన్నారు.

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘శంకరాభరణం' సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అయ్యింది. 2 గంటల 26 నిమిషాల నిడివి గల ఈ సినిమాకు సెన్సార్ వారు ‘యూ/ఏ' సర్టిఫికెట్ జారీ చేసారు

Nikil's Sankarabharanam making Video

ఈ చిత్ర యూనిట్ దీపావళి కానుకగా ప్రత్యేక టీజర్‌ని అభిమానుల కోసం విడుదల చేసింది. ఆ టీజర్ కు మంచి స్పందన వస్తోంది. ఆ టీజర్ ని ఇప్పటికే చూడకపోతే మీరు ఇక్కడ చూడండి.


వినూత్నమైన కథతో బిహార్‌ నేపథ్యంలోని గ్యాంగ్స్‌, కిడ్నాపింగ్‌ తదితర అంశాలతో హాస్యాన్ని మేళవించి తెరక్కించారు. ఈ సినిమాని ప్రముఖ రచయిత కోన వెంకట్‌ సమర్పిస్తుండగా, ఉదయ్‌ నందనవనం దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ప్రవీణ్‌ లక్కరాజు స్వరాలు అందించారు. ఈ చిత్రం దీపావళికి విడుదల కావాల్సి ఉన్నప్పటికీ 'అఖిల్‌' చిత్రం కోసం డిసెంబర్‌ 4కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

English summary
Nikil's Shankara Bharanam making video released by kona Venkat
Please Wait while comments are loading...