»   »  'పులి' చూస్తుంటే తెగ సిగ్గేసింది...నిఖిషా పటేల్

'పులి' చూస్తుంటే తెగ సిగ్గేసింది...నిఖిషా పటేల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఇటీవల మా అమ్మానాన్నలతో కలిసి 'పులి' చూశాను. రొమాంటిక్ సన్నివేశాలను మా నాన్న, తమ్ముడు చూస్తుంటే బాగా సిగ్గేసింది. ఒకింత బిడియం కలిగింది. ఏమంటారోనని చాలా టెన్షన్‌పడ్డాను. వాళ్ళు ముగ్గురూ సినిమా చూస్తుంటే నేను వాళ్ళనే చూస్తూ కూర్చున్నాను. ఆ మూడు గంటలని నేనెప్పుడూ మర్చిపోను అంటోంది పులి హీరోయిన్ నిఖిషా పటేల్. ఆమె ఈ సినిమాలో ఒళ్ళు దాచుకోకుండా అందాలు ఆరబోస్తూ కష్టపడిన సంగతి తెలిసిందే. ఇక ఆమెకు బాలీవుడ్‌కి వెళ్ళాలన్న ఆలోచన లేదని చెప్తోంది. అంతగా బాలీవుడ్ కి వెళ్ళాల్సి వస్తే...అన్ని విధాలా మంచి అవకాశం వస్తే ఆలోచిస్తాను. టాలీవుడ్‌లోనే నేను చేయాల్సిన ప్రాజెక్టులు కోకొల్లలుగా ఉన్నాయి అంది. టాలీవుడ్‌లో స్థిరపడి మంచి సినిమాల్లో నటించాలని ఉంది. చక్కటి అవకాశాలు వస్తున్నాయి. కాకపోతే తొందరపడకుండా నిదానంగా మంచి ప్రాజెక్టులను ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఇక 'పులి'లో నేను నటించిన రొమాంటిక్ సన్నివేశాలకు, కామెడీ సన్నివేశాలకు చాలా మంచి స్పందన వస్తోంది అని మురిసిపోతూ చెప్పుకొచ్చింది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu