»   » ‘నిన్ను కోరి’ ట్విట్టర్ రివ్యూ: ఇలాంటి సినిమా నాని నుండి ఊహించలేదు

‘నిన్ను కోరి’ ట్విట్టర్ రివ్యూ: ఇలాంటి సినిమా నాని నుండి ఊహించలేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'నిన్ను కోరి'. ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాన్సెప్టుతో తెరకెక్కిన ఈచిత్రం శుక్రవారం గ్రాండ్ గా రిలీజైంది. ఇప్పటికే యూఎస్ఏతో పాటు పలు చోట్ల ప్రీమియర్ షోలు వేశారు. ఈ సినిమాకు టాలీవుడ్ సెలబ్రిటీలు, ఆడియన్స్ నుండి మంచి స్పందన వస్తోంది.

నిన్ను కోరి ఒక రొమాంటిక్ ఎంటర్టెన్మెంట్ ఫిల్మ్. శివ నిర్వాణ ఈ చిత్రానికి కథ అందించగా... కోన వెంకట్ స్క్రీన్ ప్లే సమకూర్చారు. పల్లవి (నివేద థామస్) అనే అమ్మాయి చుట్టూ కథ తిరుగుతుంది. ఆమె తన భర్త అరుణ్ (ఆది పినిశెట్టి), తన ఫస్ట్ లవ్ ఉమా మహేశ్వరరావు(నాని) మధ్య నలిగిపోయే పాత్రలో నటించింది. వైజాగ్ లో మొదలైన ఈ సినిమా స్టోరీ ఆపై ఢిల్లీకి, తర్వాత సాన్ ఫ్రాన్సిస్కోకు వెలుతుంది.


నాని నుండి ఇలాంటి సినిమా ఊహించలేదు

నాని నుండి ఇలాంటి సినిమా ఊహించలేదు

హై ఎమోషన్ కంటెంటుతో సినిమా ప్రేక్షకుల మదిని దోచేస్తుందని సినిమా చూసిన వారు అంటున్నారు. ఇందులో ప్రేమికులకు సంబంధించిన ఓ అందమైన మెసేజ్ కూడా ఉంది. నాని నుండి ఇలాంటి సినిమా అసలు ఊహించలేదని అంటున్నారు ఆడియన్స్. సినిమా ఫర్వాలేదని, కథ నెమ్మదిగా నడుస్తుండటం కాస్త విసుగుతెప్పిస్తుందని కొందరంటున్నారు.


బ్రిలియంట్ ఫెర్ఫార్మెన్స్

బ్రిలియంట్ ఫెర్ఫార్మెన్స్

నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి బ్రిలియంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని, సినిమాలో ఈ ముగ్గురి నటన హైలెట్ అయిందని టాక్. మురళి శర్మ, తనికెళ్ల భరణి, పృథ్వీ తమ తమ పాత్రలకు న్యాయం చేశారని, అక్కడక్కడ తమ పెర్ఫార్మెన్స్ తో కాస్త నవ్వించారని అంటున్నారు.


టెక్నికల్ అంశాల పరంగా

టెక్నికల్ అంశాల పరంగా

ఈ చిత్రాన్ని డివివి దానయ్య డివివి ఎంటర్టెన్మెంట్ బేనర్లో నిర్మించారు. ఆయన ప్రొడక్షన్ వ్యాల్యూస్ సూపర్ గా ఉన్నాయని, గోపీ సుందర్ సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్, కార్తిక ఘట్టమనేని పిక్చరైజేషన్, సినిమాలో చూపించిన లొకేషన్లు, డైలాగులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయనే టాక్ వినిపిస్తోంది.


సెలబ్రిటీల స్పందన

సెలబ్రిటీల స్పందన

నిన్ను కోరి మోస్ట్ సెన్సబుల్ లవింగ్ మూవీ అని, ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా చూడలేదని మంచు లక్ష్మి తెలిపారు. రానా దగ్గుబాటి, మంచు మనోజ్, సింగర్ స్మిత సినిమాపై ప్రశంసలు గుప్పించారు.



సినిమా చాలా బావుంది అంటూ...

.


యావరేజ్ ఫస్టాఫ్, సెండాప్ గుడ్

యావరేజ్ ఫస్టాఫ్, సెండాప్ గుడ్

.


నాని నుండి ఇలాంటి సినిమా ఊహించలేదు

నాని నుండి ఇలాంటి సినిమా ఊహించలేదు

.


ఎమోషనల్ రైడ్

.


గుడ్ ఎంటర్టెనర్, నైస్ ఫీల్

.


యావరేజ్ ఫిల్మ్

.


యావరేజ్

.



English summary
Tollywood movie Ninnu Kori is a romance film starring Nani, Nivetha Thomas and Aadhi Pinisetty directed by Shiva Nirvana. Here are the live updates of Ninnu Kori movie review and ratings by the audience.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu