చలపతి రావు, యాంకర్ రవిపై నిర్భయ యాక్ట్ కింద కేసు నమోదు!
చలపతి రావు, యాంకర్ రవిపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో నిర్భయ యాక్ట్ కింద కేసు నమోదైంది.
హైదరాబాద్: తెలుగు సినీయర్ నటుడు చలపతి రావు, యాంకర్ రవి 'రారండోయ్ వేడుక చూద్దాం' ఆడియో వేడుకలో మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలతో వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే.
ఈ వ్యవహారానికి సంబంధించి చలపతి రావు, యాంకర్ రవిపై సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో నిర్భయ యాక్ట్ కింద కేసు నమోదైంది. TOI కథనం ప్రకారం బండ్లగూడకు చెందిన సోషల్ వర్కర్ డి కల్పనా కుమార్ ఫిర్యాదు మేరకు వీరిపై నిర్భయ యాక్ట్ కింద కేసు నమోదైనట్లు తెలుస్తోంది.

మహిళల మనోభావాలు దెబ్బతీసారని
మహిళలను కించపరుస్తూ వారి మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారని ఆరోపిస్తూ చలపతి రావు, యాంకర్ రవిపై బండ్లగూడకి చెందిన డి కల్పనా కుమార్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

ఐపీసీ 354 ఏ (IV), 509
చలపతిరావు, యాంకర్ రవిలపై ఐపీసీ 354 ఏ (IV) (మహిళలపై సెక్సువల్ కామెంట్స్) , 509(మహిళలను కించ పరచడం) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. మరి ఈ కేసు వ్యవహారంలో చలపతి రావు, యాంకర్ రవి ఎలాంటి పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందో చూడాలి.

రవి వాదన ఇలా

మేమెంత, మా బ్రతుకులెంత.... ఏమైనా అంటే అక్కడే కొట్టేవారు: యాంకర్ రవి ఆవేదన!



Click it and Unblock the Notifications











