»   »  నన్నే ఛాలెంజ్ చేసాడు: శ్రీకాంత్ కొడుకు గురించి నాగార్జున...(ట్రైలర్)

నన్నే ఛాలెంజ్ చేసాడు: శ్రీకాంత్ కొడుకు గురించి నాగార్జున...(ట్రైలర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కింగ్‌ నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ 'నిర్మలా కాన్వెంట్‌'.

ఈ చిత్రం ద్వారా జి.నాగకోటేశ్వరరావు దర్శకుడుగా పరిచయమవుతున్నారు. జై చిరంజీవ, దూకుడు, రోబో వంటి చిత్రాల్లో బాలనటిగా నటించిన శ్రేయాశర్మ ఈ చిత్రంలో రోషన్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.

కింగ్‌ నాగార్జున ప్రత్యేక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో రోషన్‌, శ్రేయా శర్మ హీరోహీరోయిన్లు కాగా ఆదిత్య మీనన్‌, సత్యకృష్ణ, సూర్య, అనితా చౌదరి, సమీర్‌, తాగుబోతు రమేష్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

 Nirmala Convent Digital Trailer

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేసారు. ట్రైలర్ ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంది. ఇందులో రోషన్.... నాగార్జునను ఛాలెంజ్ చేసినట్లు చూపించారు. కథ పరంగా సినిమాలో ఇద్దరి పాత్రలు అలా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రానికి సంగీతం: రోషన్‌ సాలూరి, సినిమాటోగ్రఫీ: ఎస్‌.వి.విశ్వేశ్వర్‌, నిర్మాణం: అన్నపూర్ణ స్టూడియోస్‌, మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌, దర్శకత్వం: జి.నాగకోటేశ్వరరావు.

English summary
Watch &Enjoy Nirmala Convent Digital Trailer. Starring Nagarjuna, Roshan, Shriya Sharma.Music composed by Roshan Salur,Directed by G.N.K.Rao and Produced by Concept Films Pvt. Ltd.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu