»   » నాగార్జునకి కోపమొచ్చిందా? ... ఈ వీడియో చూస్తే అలా అనిపించటం లేదే

నాగార్జునకి కోపమొచ్చిందా? ... ఈ వీడియో చూస్తే అలా అనిపించటం లేదే

Posted By:
Subscribe to Filmibeat Telugu

కింగ్‌ నాగార్జున సమర్పణలో హీరో శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌తో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ 'నిర్మల కాన్వెంట్‌'. ఈ చిత్రం లేటెస్త్ డిజిటల్‌ ట్రైలర్‌ను కింగ్‌ నాగార్జున ట్విట్టర్‌లో రిలీజ్‌ చేశాడు.

నాగార్జున ముందు మాట‌తో.. టీజ‌ర్ మొద‌లైంది. ఈ సినిమా క‌థ‌కు సంబంధించిన క్లూ కూడా నాగ్ చెప్పేశాడు. అయితే.. ఓ డీసెంట్‌, ఫ్రెష్ ల‌వ్ స్టోరీని చూడ‌బోతున్నార‌ని నాగ్ భ‌రోసా కూడా ఇచ్చాడు. టీజ‌ర్ కూడా అలానే క‌నిపిస్తోంది. ఈ చిత్రంలో కింగ్‌ నాగార్జున చేసిన స్పెషల్‌ క్యారెక్టర్‌ సినిమాకి పెద్ద హైలెట్ అవుతోందని చిత్ర యూనిట్ తెలిపినట్టే నాగ్ కూడా అదే క్యూరియాసిటీ మైంటెయిన్ చేస్తూ కనిపించారు.

హెడ్ సెట్ పెట్టుకొని షూటింగ్ సెట్ లో కూర్చొని ఉంటాడు నాగ్. షాట్ కి అంతా రెడీ అయినా నాగ్ అలానే కూచుండిపోవటం చూసి ఓ అసిస్టెంట్.. స్క్రిప్ట్ పేపర్లు తెచ్చి నాగ్ కి అందించగా వెంటనే వాటిని గాలిలోకి విసిరేస్తాడు. అయితే కోపంగా కాదు నాకు ఈ పేపర్లతో పనేంటీ అన్నట్టు స్టయిల్ గా విసిరేసాడు నాగ్.. ఆ తరువాత ఏం జరిగింది..? తెలుసుకోవటానికి ఎదురు చూస్తూనే ఉండండి అంటూ కింద ఓ సబ్ టైటిల్ తో టీజర్ రిలీజ్ చేసారు. .

ఓ డీసెంట్‌, ఫ్రెష్ ల‌వ్ స్టోరీని చూడ‌బోతున్నార‌ని నాగ్ భ‌రోసా కూడా ఇచ్చాడు. టీజ‌ర్ కూడా అలానే క‌నిపిస్తోంది. లొకేష‌న్లు, కాస్టింగ్‌, రిచ్‌నెస్ ఇవ‌న్నీ నిర్మ‌లా కాన్వెంట్‌పై అంచ‌నాలు పెంచుతున్నాయి. రోష‌న్‌ని చూస్తుంటే బుల్లి శ్రీ‌కాంత్‌లా ఉన్నాడు. శ్రీ‌కాంత్ ఫేస్ క‌ట్స్ బాగా క‌నిపిస్తున్నాయి. మ‌రి న‌ట‌న ఏ రేంజులో ఉంటుందో?? చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకొన్న నిర్మ‌లా కాన్వెంట్ పాట‌ల్ని అతి త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నున్నారు.

English summary
King Nagarjuna shared "Nirmala convent" latest Digital teaser in his Twitter account. Nagarjuna playing a guest Role in this Movie
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu