»   » చూసారా? నాగార్జున స్వయంగా పాడిన పాట (వీడియో)

చూసారా? నాగార్జున స్వయంగా పాడిన పాట (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: అవనూ....నాగార్జున పాడిన పాట విన్నారా! ఇప్పుడు ఇదే ప్రశ్న సినీ లవర్స్ ని ఊపేస్తోంది. హఠాత్తుగా నాగార్జున పాట పాడాల్సిన అవసరం ఏమి వచ్చింది అంటే ప్రాజెక్టు కు క్రేజ్ తేవటానికి. ఆయన ప్రస్తుతం చేస్తున్న నమో వెంకటేశాయ సినిమా కోసం కాదు కదా...ఆ ప్రాజెక్టు కు పాట పాడి క్రేజ్ తేవటం ఏంటి అంటారా...అయితే ఈ క్రింద మ్యాటర్ చదివి, పాట వినాల్సిందే.

శ్రీకాంత్‌ కుమారుడు రోషన్‌ హీరోగా పరిచయమౌతున్న 'నిర్మలా కాన్వెంట్‌' చిత్రంలోని కొత్త కొత్త భాష.. అనే పాటను హీరో అక్కినేని నాగార్జున పాడారు. ఈ పాట వీడియోను నాగార్జున్‌ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా విడుదల చేశారు. ఎప్పటిలాగే కొత్తగా ప్రయత్నించా.. అని ట్వీట్‌ చేశారు.

నాగార్జున అప్పుడప్పుడు గెస్ట్ రోల్ లో తళుక్కున మెరుస్తుంటారనే సంగతి తెలిసిందే. మనసుకు నచ్చితే, సినిమాకి అవసరమనుకొంటే ఆయన ఏమాత్రం ఆలోచించరు. త్వరలో నాగ్‌ రెండు చిత్రాల్లో అతిథిగా సందడి చేయబోతున్నారు. శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ హీరోగా పరిచయమవుతున్న 'నిర్మలా కాన్వెంట్‌'లో నాగార్జున ఒక చిన్న పాత్రలో కనిపించనున్నారు. నాగార్జున సొంత సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.

'నిర్మలా కాన్వెంట్‌' చిత్రానికి జి. నాగకోటేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నాగార్జున ఓ ప్రత్యేక పాత్రను పోషిస్తూ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. రోషన్‌ సరసన శ్రేయాశర్మ నటిస్తున్నారు. జై చిరంజీవ, దూకుడు, రోబో వంటి చిత్రాల్లో బాలనటిగా నటించిన శ్రేయాశర్మ ఈ చిత్రంలో రోషన్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.

గతంలో సితారామరాజు సినిమాలో నాగార్జున సిగరెట్ గురించి ఓ పాట పాడారు. ఇపుడు మళ్లీ ఇన్నాళ్ల తర్వాత 'నిర్మలా కాన్వెంట్'లో పాట పాడుతునప్నాడు.

నాగార్జున ప్రత్యేక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో రోషన్‌, శ్రేయా శర్మ హీరోహీరోయిన్లు కాగా ఆదిత్య మీనన్‌, సత్యకృష్ణ, సూర్య, అనితా చౌదరి, సమీర్‌, తాగుబోతు రమేష్‌ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: రోషన్‌ సాలూరి, సినిమాటోగ్రఫీ: ఎస్‌.వి.విశ్వేశ్వర్‌, నిర్మాణం: అన్నపూర్ణ స్టూడియోస్‌, మ్యాట్రిక్స్‌ టీమ్‌ వర్క్స్‌, దర్శకత్వం: జి.నాగకోటేశ్వరరావు.

ప్రస్తుతం నాగార్జున.. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న 'ఓం నమో వేంకటేశాయ' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రగ్యా జైశ్వాల్‌, అనుష్క ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

English summary
Watch King Nagarjuna Singing And Performing Kotha Kotha Bhasha Song From Nirmala Convent Movie.Starring Nagarjuna, Roshan, Shriya Sharma.Music composed by Roshan Salur,Directed by G.N.K.Rao and Produced by Concept Films Pvt. Ltd.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu