»   » కాజల్ చెల్లెలు కూడా మొత్తానికి పట్టాలు ఎక్కింది

కాజల్ చెల్లెలు కూడా మొత్తానికి పట్టాలు ఎక్కింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టార్ హీరోయిన్ కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ హీరోయిన్ గా తెరంగ్రేటం చేస్తుందని గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ వార్తలను నిజం చేస్తూ ఆమె వరుణ్ సందేశ్ ప్రక్కన హీరోయిన్ గా సెలక్ట్ అయింది. సంపత్ నంది అనే రచయిత దర్శకుడుగా పరిచయం అవుతూ చేస్తున్న ఈ చిత్రం రీసెంట్ గా లాంచ్ అయింది. జూన్ 21 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ సంస్థ పతాకంపై కె.కె.రాధామోహన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్బంగా రాధామోహన్నిర్మాత మాట్లాడుతూ "కొత్తతరహాలో సాగే ప్రేమ కథ ఇది. హీరో, హీరోయిన్స్ పాత్రలు తప్పకుండా యూత్ కి నచ్చుతాయి" అన్నారు.

రాధామోహన్ ఇంతకుముందు సముద్ర దర్శకత్వంలో జగపతి బాబు హీరోగా అధినేత చిత్రాన్ని నిర్మించారు. అది బాక్సాపీస్ వద్ద భోల్తా కొట్టింది. ఇక ఈ చిత్రంలో వెన్నెల కిషోర్‌, ఎమ్మెస్‌ నారాయణ, ప్రగతి, గురురాజ్‌ తదితరులు నటిస్తున్నారు. సమర్పణ: ఆదివిల్లి రామకృష్ణ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: ఎమ్‌.ఎస్‌.కుమార్‌, ఛాయగ్రహణం: బుజ్జి, సంగీతం: చక్రి అందిస్తున్నారు. తొలిసారిగా తెరపై హీరోయిన్ గా కనిపించనున్న నిషా అగర్వాల్ తన అక్క లాగానే నిలదొక్కుకోవాలని కోరుకుందాం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu