For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నిషా అగర్వాల్ వివాహ తేదీ ఖరారు

  By Srikanya
  |

  హైదరాబాద్ : స్టార్ హీరోయిన్ కాజల్‌ చెల్లెలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకొంది నిషా అగర్వాల్‌. తెలుగు, తమిళ భాషల్లో ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్న నిషా.. త్వరలోనే పెళ్లికూతురు కాబోతోందని సమాచారం. ముంబైకి చెందిన కరణ్‌ వాలేచాతో నిషాకి పెళ్లి కుదిరిందని సమాచారం. వారిద్దరూ చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారని తెలుస్తోంది. ఈ యేడాది చివర్లో ఇద్దరికీ పెళ్లిచేయాలని ఇరు కుటుంబాలూ నిర్ణయించుకొన్నాయట. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు.

  డిసెంబర్ 28న వివాహం జరగనుంది. ఇరు వైపుల పెద్దలూ ఈ వివాహ విషయమై సంతోషంగా ఉన్నారని ప్రకటన చేసారు.ఇక నిషా అగర్వాల్ ... 'ఏమైంది ఈవేళ', 'సోలో' చిత్రాలతో విజయాలు అందుకొంది. మరోవైపు తమిళంలోనూ కొన్ని సినిమాలు చేసింది. ప్రస్తుతం 'డి.కె.బోస్‌' అనే తెలుగు సినిమాలో నటిస్తోంది. నిషా జోరు చూసి 'కాజల్‌కి పోటీ వచ్చేసింది...' అనుకొన్నారంతా. అయితే ఇప్పుడు పెళ్లి చేసుకుని ఆమె పోటి నుంచి తప్పుకుంటోంది.

  సందీప్‌ కిషన్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'డీకే బోస్‌'. నిషా అగర్వాల్‌ హీరోయిన్. ఎన్‌.బోస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శేషురెడ్డి, ఆనంద్‌రంగా నిర్మాతలు. ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యూత్ ఫుల్ ఎంటర్టెనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంబంధించిన ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్, శాటిలైట్ రైట్స్ ఇప్పటికే మంచి రేటుకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. ప్రేమ కథా చిత్రమ్‌లో కామెడీ పండించిన సప్తగిరి ఈచిత్రంలోనూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే పాత్ర పోషిస్తున్నట్లు యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

  నిర్మాతలు మాట్లాడుతూ ''అవినీతిపరుడైన యువ పోలీసు అధికారి కథ ఇది. పైసా ముట్టందే ఏ పనీ చేయని అతగాడు ప్రేమలో పడ్డాక ఎలా మారిపోయాడన్నది తెరపైనే చూడాలి. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చింది. సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది'' అన్నారు.

  దర్శకుడు ఎన్.బోస్ మాటల్లో... 'ఆ పోలీస్‌ ఆఫీసర్ డబ్బు కోసం ఎలాంటి పనినైనా చేయడానికి సిద్ధపడతాడు. తాను పోలీస్‌ఆఫీసర్‌గా గోల్డ్‌మెడల్స్ అందుకోవాలని రాలేదు. గోల్డ్ బిస్కెట్స్ సంపాందించడానికి వచ్చాను అనుకునే తత్వం అతనిది. అలాంటి ఆ యువ పోలీస్ ఓ అమ్మాయి ప్రేమలో పడతాడు. అప్పుడు అతనిలో వచ్చిన మార్పేమిటి? అనేది చిత్ర కథ అన్నారు. ఈ చిత్రంలో సంపత్ కుమార్, అన్నపూర్ణమ్మ, బ్రహ్మాజీ, కోట శ్రీనివాసరావు, అజయ్ కుమార్, మల్లాది, సత్తెన్న, రవి వర్మ తదితరులు నటిస్తున్నారు.

  English summary
  Nisha Agarwal is all set to marry her boyfriend. She got engaged to her boyfriend a Mumbai-based businessman Karan Valecha. "The wedding will take place on Dec 28 and the families of the bride and groom are happy to share the news and seek blessings," said a statement.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X