»   » ఆ...‘క్రిమినల్స్‌’లో నిషా కొఠారి!

ఆ...‘క్రిమినల్స్‌’లో నిషా కొఠారి!

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : 'మంత్ర' దర్శకుడు ఓషో తులసీరామ్ దర్శకత్వంలో మంత్ర ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై 'మంగళ' చిత్రాన్ని రూపొందించిన నిర్మాత సి.హెచ్.వి.శర్మ తాజాగా ఓషోతులసీరామ్ దర్శకత్వంలో మరో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'క్రిమినల్స్' పేరుతో రూపొందుతున్న ఈచిత్రంలో నిషా కొఠారి ప్రధాన పాత్ర పోషిస్తోంది.

సినిమా గురించి దర్శకుడు ఓషో తులసీరామ్ మాట్లాడుతూ...'సైబర్ క్రైమ్ నేపథ్యంలో సాగే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాము. సెప్టెంబర్ రెండో వారంలో ఈ చిత్రానికి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాం. హైదరాబాద్, తలకోన, బ్యాంకాక్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంది' అన్నారు.

హీరోయిన్ నిషా కొఠారి మాట్లాడుతూ 'తులసీరామ్ గారు చెప్పిన కథ బాగా నచ్చింది. డిఫరెంట్ కాన్సెప్టుతో అందరినీ థ్రిల్ చేసే విధంగా ఉంటుంది. నాకు అన్ని విధాలా నచ్చిన క్యారెక్టర్ కావడంతో ఈ సినిమా చేస్తున్నారు. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని భావిస్తున్నాను' అన్నారు.

ఈ చిత్రంలో నిషా కొఠారి ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. మంత్ర చిత్రానికి సంగీతం అందించిన ఆనంద్ ఈచిత్రానికి కూడా బానీలు సమకూర్చనున్నాడు. నిర్మాత : సి.హెచ్.వి.శర్మ, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : ఓషో తులసీరామ్.

English summary
Actress Nisha Kothari next movie is Criminals. The movie directed by Osho Tulasiram and produced by CHV Sharma under Mantra entertainments banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu