»   » నిత్యామీనన్‌తో సినిమా అంటే షరతులు ఇవే

నిత్యామీనన్‌తో సినిమా అంటే షరతులు ఇవే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నిత్యమీనన్‌ ఖాతాలో హిట్స్ ఉన్నా...కెరీర్ మాత్రం కదలటం లేదు. 'గుండెజారి గల్లంతయ్యిందే' తరవాత ఆమె కెరీర్‌ జోరందుకోలేదు. దీనికి కారణం .... పారితోషికం విషయంలో ఎప్పుడూ పేచీ పెట్టలేదు గానీ, 'కథేంటి? నా పాత్ర పరిధి ఎంత? వయసు ఎక్కువున్న హీరోతో నటించను' అంటూ కొన్ని షరతుల చిట్టా విప్పుతుందని చెప్తున్నారు. దాంతో దర్శక నిర్మాతలు బెదిరిపోతున్నారు. తనకు తానుగా చాలా సినిమాల్ని వదులుకొంది నిత్య. 'ఏమిటో ఈ మాయ'లో శర్వానంద్‌ పక్కన నటిస్తోంది. అదొక్కటే నిత్య చేతిలో ఉన్న తెలుగు సినిమా.

చేరన్ దర్శకుడిగా తెలుగు,తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న చిత్రం 'ఏమిటో ఈ మాయ'. శర్వానంద్‌, నిత్యమీనన్‌ జంటగా నటించారు. స్రవంతి రవికిషోర్‌ నిర్మాత. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. వృత్తి, ఉద్యోగ జీవితం.. అంటూ నేటి యువత ఉరుకులు.. పరుగులు పెడుతోంది. అనుబంధాలు, ఆత్మీయతలకు దూరంగా పరిగెడుతున్న వారు ఏం కోల్పోతున్నారో మా చిత్రంలో చూపిస్తున్నామంటున్నారు చేరన్‌.

నిర్మాత మాట్లాడుతూ ''పిల్లలపై తల్లిదండ్రులు చాలా ఆశలు పెట్టుకుంటారు. తాము కన్న కలల్ని సాకారం చేయాలని ఆశిస్తుంటారు. అయితే ఈ విషయంలో యువత ఏం చేస్తోందనేదే ఈ చిత్ర ప్రధానాంశం. నేటి తరం ప్రేమ వ్యవహారాల్లో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు చేరన్‌. మనసుని హత్తుకునేలా భావోద్వేగాలుంటాయి. అంతే స్థాయిలో వినోదమూ ఉంటుంది. ఈ సినిమా యువతనే కాకుండా అందరినీ ఆకట్టుకొంటుంది. శర్వానంద్‌, నిత్యమీనన్‌ల జంట అందరినీ అలరిస్తుంది. వచ్చే నెలలో పాటల్ని విడుదల చేస్తాము'' అన్నారు.

జాతీయ అవార్డ్‌ గ్రహీత చేరన్‌తో పనిచేయడం ఆనందాన్నిస్తోందని శర్వానంద్‌ అన్నారు. సిటీ నేపథ్యంలోని చక్కని కథాంశమిదని నిత్యామీనన్‌ తెలిపింది. ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాష్‌ కుమార్‌, పాటలు: అనంత శ్రీరామ్‌, సమర్పణ: కృష్ణ చైతన్య.

English summary
Nitya Menon is quite comfortable doing movies with her age group stars and don't want to cast opposite senior hero's.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu