For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Maestro Twitter Review: మాస్ట్రోకు షాకింగ్ రిజల్ట్.. ప్లస్ మైనస్ అవే.. నితిన్ ఆ తప్పు చేయకపోతే!

  |

  చాలా చిన్న వయసులోనే 'జయం' అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయం అయ్యాడు యూత్ స్టార్ నితిన్. మొదటి చిత్రంతోనే సూపర్ హిట్‌ను అందుకున్న అతడు.. నటుడిగానూ మంచి మార్కులు కొట్టేశాడు. ఆ తర్వాత కూడా పలు విజయాలను తన ఖాతాలో వేసుకుని సత్తా చాటాడు. అప్పుడప్పుడే స్టార్ స్టేటస్‌ను అందుకుంటోన్న సమయంలో వరుస ఫ్లాపులతో తెగ ఇబ్బంది పడ్డాడు. ఇలా తన కెరీర్‌ను ప్రశ్నార్థకం చేసుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో 'ఇష్క్'తో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కి.. అక్కడి నుంచి వెనుదిరిగి చూడకుండా ముందుకు వెళ్తున్నాడీ టాలెంటెడ్ హీరో. అయితే, మళ్లీ అతడు వరుస పరాజయాలతో సతమతం అవుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు 'మాస్ట్రో' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ మూవీ ట్విట్టర్ రివ్యూపై ఓ లుక్కేద్దాం పదండి!

  నితిన్‌కు అప్పుడే రెండు భారీ షాక్‌లు

  నితిన్‌కు అప్పుడే రెండు భారీ షాక్‌లు

  గత ఏడాది నితిన్ ‘భీష్మ'తో భారీ హిట్ కొట్టాడు. ఈ ఉత్సాహంతోనే ఈ సంవత్సరం అతడు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ‘చెక్' అనే సినిమాలో నటించాడు. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ ముందు బోల్తా పడిపోయింది. దీంతో అతడికి ఆదిలోనే బిగ్ షాక్ తగిలినట్లైంది. ఇక, దీని తర్వాత నితిన్.. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ‘రంగ దే' చిత్రం విడుదలైంది. ఇది కూడా భారీ అంచనాల నడుమ విడుదలైంది. టాక్ బాగానే ఉన్నా కలెక్షన్లను రాబట్టలేక పరాజయం పాలైంది. దీంతో అతడికి వరుస షాక్‌లు తగిలినట్లైంది.

  తల్లి కాబోతున్న కాజల్ అగర్వాల్: ఆమె ప్రెగ్నెంట్ అనడానికి ఇదే సాక్ష్యం.. అలా కనిపించడంతో!

   మాస్ట్రో అంటూ వచ్చిన యూత్ స్టార్

  మాస్ట్రో అంటూ వచ్చిన యూత్ స్టార్

  వరుస ఫ్లాపుల తర్వాత యూత్ స్టార్ నితిన్ నటించిన మూడో చిత్రం ‘మాస్ట్రో'. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘అంధాధున్'కు రీమేక్‌గా వస్తున్న దీనిని మేర్లపాక గాంధీ తెరకెక్కించాడు. ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్‌గా నటించగా.. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రను తమన్నా చేసింది. అంధాధున్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ఈ మూవీని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై నికితా రెడ్డి, సుధాకర్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. ఇందులో శ్రీముఖి, రచ్చ రవి, మంగ్లీ, జిస్సుసేన్ గుప్తా, నరేష్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.

  భారీ అంచనాలు.. ఓటీటీతో బిగ్ డీల్

  భారీ అంచనాలు.. ఓటీటీతో బిగ్ డీల్

  ‘మాస్ట్రో' మూవీపై ఆరంభంలో అంతగా అంచనాలు లేవన్న విషయం తెలిసిందే. కానీ, క్రమంగా ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో ఆసక్తి పెరిగిపోయింది. దీనికి కారణం దీని నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రైమ్ థ్రిల్లర్ మూవీగా రూపొందిన ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందుకోసం సదరు సంస్థ ఏకంగా రూ. 32 కోట్లు వెచ్చించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో విడుదలకు ముందే నితిన్‌కు టేబుల్ ప్రాఫిట్ కూడా సొంతం అయినట్లు టాలీవుడ్ ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు.

  బాత్రూంలో బ్రాతో సమంత రచ్చ: అందాలన్నీ చూపిస్తూ మరీ ఘాటుగా.. ఫస్ట్ టైమ్ ఈ రేంజ్‌లో!

  అలా వచ్చిన మాస్ట్రో.. ఇలా రెస్పాన్స్

  అలా వచ్చిన మాస్ట్రో.. ఇలా రెస్పాన్స్

  యూత్ స్టార్ నితిన్ నటించిన ‘మాస్ట్రో' మూవీ ఎన్నో అంచనాల నడుమ సెప్టెంబర్ 17 అంటే ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇండియాలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్‌లో స్ట్రీమింగ్ అవుతోందీ చిత్రం. ఓవర్సీస్‌లో మాత్రం నేరుగా థియేటర్లలో ప్రీమియర్ షోలు వేశారు. ఇప్పటి వరకూ ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. దీన్ని చూసిన వాళ్లంతా అదిరిపోయేలా ఉందని కితాబిస్తున్నారు. ఈ మేరకు ట్విట్టర్ సహా సోషల్ మీడియా ఖాతాల్లో తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. దీంతో ‘మాస్ట్రో' మూవీ పేరు ఇంటర్నెట్‌లో మారుమ్రోగిపోతోంది.

  సినిమా ఎలా ఉందని అంటున్నారు

  సినిమా ఎలా ఉందని అంటున్నారు

  ఇప్పటి వరకూ ‘మాస్ట్రో' మూవీని చూసిన వాళ్లంతా సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ సినిమా అదిరిపోయేలా ఉందని అంటున్నారు. అంధాధున్‌ కథకు పెద్దగా మార్పులు చేయకుండానే దీన్ని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చారని చెబుతున్నారు. రీమేక్ సోల్‌ను మిస్ కాకుండా క్యారీ చేయడంలో దర్శకుడు సఫలం అయ్యాడని అంటున్నారు. మొత్తానికి ఈ సినిమా అదుర్స్ అనిపించిందని అభిప్రాయపడుతున్నారు. అంధాధున్ చూసిన వాళ్లు ఓకే అన్నా.. చూడని వాళ్లు మాత్రం ఫిదా అవడం గ్యారెంటీనట.

  Bigg Boss: షోలో సంచలన సంఘటన.. సిరి టీషర్ట్‌లో చేయి పెట్టిన కంటెస్టెంట్.. అందరి ముందే బలవంతంగా!

  ‘మాస్ట్రో'లో ప్లస్.. మైనస్‌లు ఏంటి?

  ‘మాస్ట్రో'లో ప్లస్.. మైనస్‌లు ఏంటి?

  ‘మాస్ట్రో' మూవీ అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో ఈ సినిమాను ఇప్పటికే చాలా మంది చూసేశారు. వీళ్లంతా మూవీ అద్భుతంగా ఉందని కొనియాడుతున్నారు. మరీ ముఖ్యంగా అంధుడిగా నితిన్ నటన, నెగెటివ్ షేడ్స్‌తో తమన్నా యాక్టింగ్, డైరెక్టర్ మేర్లపాక గాంధీ మేకింగ్, మహతీ స్వర సాగర్ అందించిన బ్యాగ్రౌండ్, జే యువరాజ్ సినిమాటోగ్రఫి, స్క్రీన్‌ప్లే, సినిమాకు ప్లస్ పాయింట్స్ అని చెబుతున్నారు. ఇక, మైనస్‌ల విషయానికి వస్తే.. సెకెండాఫ్‌లో కొంత ల్యాగ్, లాజిక్ లేని పలు సన్నివేశాలు, కామెడీ లేకపోవడం వంటివి నిరాశ పరిచాయని అంటున్నారు.

  Nithiin Vinayaka Chavithi Special Interview | Maestro Movie
   ఆ పొరపాటు చేయకుంటే బాగుండేది

  ఆ పొరపాటు చేయకుంటే బాగుండేది

  ‘మాస్ట్రో' మూవీని చూసిన వాళ్లంతా ఇది ఎలా ఉందో అన్న దానిపై తమ తమ అభిప్రాయాలను చెబుతున్నారు. అదే సమయంలో ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని నితిన్ తీసుకున్న నిర్ణయాన్ని సైతం తప్పుబడుతున్నారు. థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌తో చూడాల్సిన సినిమాను ఓటీటీకి ఇవ్వడం దారుణం అని, ఒకవేళ బిగ్ స్క్రీన్‌పై ఇది విడుదలై ఉంటే కచ్చితంగా రూ. 50 కోట్లు కలెక్ట్ చేసేదని నితిన్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి షాకింగ్‌గా సినిమాను చూసిన వాళ్లంతా ఇలా స్పందిస్తున్నారు. మూవీ కూడా సూపర్‌గా ఉందని అభిప్రాయపడుతున్నారు.

  English summary
  Youth Star Nithiin Now Did Maestro Movie Under Merlapaka Gandhi Direction. Check Here To Know Audience Review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X