Don't Miss!
- Sports
అందుకే నా వికెట్ త్యాగం చేశా: వాషింగ్టన్ సుందర్
- Lifestyle
Vastu Tips: లక్ష్మీదేవి లాంటి చీపురు ఎప్పుడు కొనాలి, ఇంట్లో ఎక్కడ పెట్టాలో తెలుసా?
- News
అటెన్షన్ అమరావతి: అందరి చూపూ అటు వైపే..!!
- Finance
household income: భారతీయ కుటుంబాలపై సర్వే.. ఆదాయం, పొదుపులు ఎంతో తెలుసా ?
- Technology
Oppo నుండి కొత్త టాబ్లెట్, లాంచ్ కు సిద్ధం! ఆన్లైన్ లో స్పెసిఫికేషన్లు లీక్ ..!
- Automobiles
భారతీయ మార్కెట్లో Hero XOOM ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల: ప్రైస్, వేరియంట్స్ & కలర్ ఆప్సన్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Rang De Twitter Review: నితిన్, కీర్తి పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే.. కామెడీ టైమింగ్ అంటూ
కీర్తి సురేష్ నితిన్ జంటగా వచ్చిన చిత్రం రంగ్ దే. అసలే నితిన్ చెక్ సినిమా అస్సాం వెళ్లిపోయిందని చెప్పుకుంటూ తన బాధను బయటపెట్టేస్తున్నాడు. మరి ఎన్నో ఆశలు, సెంటిమెంట్‌లు పెట్టుకున్న రంగ్ దే సినిమా నేడు (మార్చి 26) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే కొన్ని చోట్ల షోలు పడిపోయాయి. ఈ సినిమాను చూసిన, చూస్తున్న నెటిజన్లు ట్వీట్లు వేయడం మొదలుపెట్టారు. రంగ్ దే సినిమాపై తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు.

ముందు నుంచీ అదే..
రంగ్
దే
సినిమాకు
ముందు
నుంచీ
కీర్తి
సురేష్
నితిన్
జంట
మధ్య
ఉండే
కెమిస్ట్రీయే
బలమని
అందరూ
చెప్పుకుంటూ
వస్తున్నారు.
టీజర్,
ట్రైలర్
ఇలా
అన్నింట్లోనూ
అదే
కనిపించింది.
ఆఫ్
స్క్రీన్
కెమిస్ట్రీని
కూడా
బాగానే
నడిపించారు.
అను
అర్జున్
పేర్లు
చెప్పి
ఈ
ఇద్దరూ
సోషల్
మీడియాలో
రచ్చ
చేశారు.

భారీ హైప్..
ఇక రంగ్ దేపై భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేయగా.. అంతే రేంజ్‌లో హైప్ క్రియేట్ అయింది. గతేడాది రావాల్సిన సినిమా కరోనా వల్ల వాయిపడ్డ సంగతి తెలిసిందే. అయినా సరే విడుదల సమయం వరకు అన్నింటిని కరెక్ట్‌గా ప్లాన్ చేసి ప్రమోట్ చేశారు. పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా జనాల్లోకి బాగానే వెళ్లాయి.

కథ అదే..
రంగ్ దే ట్రైలర్ చూస్తేనే కథ ఏంటో అర్థమవుతోంది. ఇద్దరి మధ్య ఉండే ఇగోలు, గొడవలు, ద్వేషం, ప్రేమల నేపథ్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రేక్షకులు సైతం ఈ ఇద్దరి మధ్య జరిగే టాం అండ్ జెర్రీ వార్‌ను ఎంజాయ్ చేస్తారట. ఇప్పటికే సినిమాను వీక్షించిన జనాలు నితిన్ కీర్తి సురేష్ కెమిస్ట్రీ బాగుందని అంటున్నారు.

యావరేజ్ అంటూ..
ఇప్పటికైతే రంగ్ దే సినిమా ప్రథమార్థం ఫలితం మాత్రం వచ్చేసింది. రొటీన్ స్టోరీతో కామెడీ సీన్స్‌లతో నెట్టుకొచ్చారని, పాటలు బాగున్నాయని అంటున్నారు. పీసీ శ్రీరామ్ అందించిన విజువల్స్ అదిరిపోయాయని కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో రంగ్ దే ద్వితీయార్థంపైనే సినిమా ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది.
Recommended Video

కామెడీ టైమింగ్..
రంగ్ దే సినిమాలో నితిన్ కీర్తి సురేష్ కాకుండా మిగతా వారి నటన గురించి కూడా నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా అభినవ్ గోమటం కామెడీ టైమింగ్ అదిరిపోయిందని చెబుతున్నారు. మొత్తానికి ఈ సినిమాకు చివరి 40 నిమిషాలు కీలకమని దర్శకుడు కూడా చెప్పేశాడు.