»   » నితిన్ ‘ఛల్ మోహన్ రంగ’కు అదిరిపోయే శాటిలైట్ రైట్స్!

నితిన్ ‘ఛల్ మోహన్ రంగ’కు అదిరిపోయే శాటిలైట్ రైట్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

నితిన్, మేఘా ఆకాష్ జంటగా తెరకెక్కిన 'ఛల్ మోహన్ రంగ' ఈ రోజు గ్రాండ్‌గా విడుదలైంది. 'రౌడీ ఫెలో' ఫేం కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వినిపిస్తోంది. నితిన్ కెరీర్లో 25వ సినిమా కావడం, పవన్ కళ్యాణ్ ఈ చిత్ర నిర్మాణంలో భాగం కావడం, త్రివిక్రమ్ స్క్రిప్టు అదించడం లాంటి అంశాలతో ఈ చిత్రంపై మందు నుండీ మంచి అంచనాలున్నాయి.

కాగా.... ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ మంచి ధరకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. జీ తెలుగు వారు రూ. 5 కోట్లకు ఈ చిత్ర రైట్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. నితిన్ సినిమాల్లో ది బెస్ట్ శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న సినిమాల్లో ఇదీ ఒకటిగా నిలిచింది.


Nithiin’s Chal Mohan Ranga gets a massive Satellite deal

ఇక పోతే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఎలాంటి ఫలితాలు రాబట్టబోతోంది అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ 'రంగస్థలం' సినిమా బరిలో ఉన్న నేపథ్యంలో నితిన్ మూవీ ఆ చిత్రానికి ఏ మేరకు పోటీ ఇస్తుంది అనే విషయమై చర్చ సాగుతుంది.


తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ఏలో 'ఛల్ మోహన్ రంగ' భారీ ఎత్తున విడుదల చేశారు. ఫస్ట్ వీకెండ్ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ బట్టి ఈ సినిమా ఫలితం తేలిపోతుంది. ఇప్పటి వరకైతే సినిమాపై పాజిటివ్ బజ్ ఉంది.

English summary
Nithiin and Megha Akash starrer Chal Mohan Ranga satellite rights sold out for a whopping price by a popular Telugu Channel. Zee Telugu has acquired the digital and satellite rights of Chal Mohan Ranga for Rs. 5 Cr, which is a huge amount for Nithiin’s film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X